అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
27, డిసెంబర్ 2009, ఆదివారం
గవర్నర్ ..... ఓ కళంకం
1, డిసెంబర్ 2009, మంగళవారం
విద్యార్థులా..... విద్వంసకారుల?
విద్యార్థుల ముక్య విధి చదువు.అది వదలి ఎవ్వరి కోసమో రాజకీయాలతో మమేకం కావడం ఎంతవరకు న్యాయం?ఇలాంటి వారికా ప్రభుత్వం వేల రూపాయలతో జీతమిస్తూ, విద్యార్థులకు ఉపకార వెతనాలిస్తూ,మల్లి వారిచే ఆస్తులు ధ్వంసం చేయించుకొంటూ ఇలా ఎంత కాలం?ఎవరి ప్రయోజనాలకోసం మొదలైన ప్రత్యక రాష్ట్రము వల్ల మీకు కలిగే లాభం ఎంతా? మిమ్మల్ని భారిస్తున్నది అఖిలాంధ్ర రాష్ట్ర ప్రజలు. మీ ఇంటి ఆస్తులు మొదట నాశనం చేయి . అవి సమైక ఆంధ్ర రాష్ట్రము లో సంపాదించింది. వాటిని వదిలేసి ఏ పాపం తెలియని ప్రజల ఆస్తులు నాశనం చేస్తారా? మీ ఇంటిని నాశనం చేయి , అప్పుడు మీ తల్లిదండ్రులు తన్ని బయట తరిమితే తెలుస్తుంది? ప్రజలేమన్న మీ అబ్బ సొమ్ముతో కొనుకోన్నర? కడుపుకు అన్నమే తింటే ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి వారే నిజమైన తివ్రవాదులు. దేశ అభివృద్ధికి నిరంతర అవరోధకులు.
21, నవంబర్ 2009, శనివారం
20, నవంబర్ 2009, శుక్రవారం
30, అక్టోబర్ 2009, శుక్రవారం
ఏది గొప్ప?
మానవ జీవితం లో ప్రేమ గొప్పదా? లేక స్నేహం గొప్పదా? అని అడిగితే ఖచ్చితం గా స్నేహమే గొప్పదని చెప్తారు.ఎందుకంటే ప్రేమకి స్వార్థం ఉంటుంది , వీరి ప్రేమ నాకే .. వీరినే పెళ్లి చేసుకోవాలి అని . కాని స్నేహితుల మధ్య స్వార్థం ఖచ్చితం గా ఉండదు. ఉండినది అంటే అది స్నేహం కాదు. ప్రేమకు చివరి అంకం పెళ్లి లేకవిచారం కావచ్చు.కాని స్నేహానికి చివరి అంకం కూడా స్నేహమే.అలంటి స్నేహం లో అపార్థాలు కానీ, ఒకరి నుంచే చొరవ గాని ఉండవు. అది కచ్చితం గా స్నేహానికి అవరోధాలే.నిజానికి కొంత మంది స్నేహితులమధ్య డబ్బు సమస్యతో గొడవలు రావడము నే చూసాను.అందుకే నా స్నేహితులతో ఆ సమస్య రాకుండా ఉండేందుకు ఎక్కువ సార్లు నేనే ఫోన్ చేస్తుంటాను. వాళ్ళేఫోన్ చేసినా కట్ చేసి చేస్తుంటాను.
25, అక్టోబర్ 2009, ఆదివారం
ప్రేమే జీవితమా?
10, అక్టోబర్ 2009, శనివారం
ఈ విషయం చంద్రుడికి ఎలా తెలిసిందని సందేహమా?అక్కడి విషయాలు మనకి తెలియగా లేనిది ఇక్కడి విషయాలు చంద్రుడికి తెలియవా? చంద్రుడి నుంచి లేఖ వచ్చిందని తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా అందరు అందులోని విషయం తెలుసుకోవడానికి ఉత్కంటతో ఎదురు చూస్తున్నారు.వారం , పది రోజులు ప్రయత్నిస్తున్న అందులోని గుర్తులు , సంకేతాలు అర్థం కాకా ఇంటర్నెట్ లో , టీవీ లలో డీకోడ్ కి ప్రయత్నించామని ప్రచారం చేసారు.ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించి విపలమైనారు. అలాంటి పరిస్థితిలో ఓ మానసిక శాస్త్రవేత్త , గుండె నిపుణుడు కలసి చిరు ప్రయత్నం గా
దేకోడ్ కి ప్రయత్నిస్తుటే అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంతో కష్టపడితే దాని సారాంశం ఎలా ఉంది.
"ప్రియమైన అల్లుల్లరా(చందమామ అంటాము కాబట్టి)! అన్ని గ్రహలము కలసి మీరు ఉండేందుకు సమస్త వసతులతో భూమిని తయారు చేసి ఇస్తే స్వార్థం తో దానిని కాలుష్యం చేసుకొని అష్టకష్టాలు పడుతున్నది చాలక
8, అక్టోబర్ 2009, గురువారం
క్యూసెక్కులు :- నదులలో నీటిప్రవాహాన్ని క్యుసేక్కులలో కొలుస్తారు.క్యూసెక్కు అనేది "క్యూబిక్ ఫుట్ ఫర్ సెకండ్" సంక్షిప్త నామము.ఒక్క క్యుసేకు సుమారు 28.317 లీటర్లు. ఉద:శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి గరిష్టం గా 26 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందంటే ఒక్క సెకనులో 7.36 కోట్ల లీటర్ల నీరు వచిందన్న మాట.
T M C :- ప్రాజెక్ట్లలో నిల్వ నీటిని tmc లలో కొలుస్తారు. అనగా "తౌజెండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్" ఒక్క tmc అనగా 2.83 కోట్ల క్యూబిక్ మీటర్ల నీటితో సమానం.ఒక్క క్యూబిక్ మీటరు వెయ్యి లితెర్లకి సమానం.మొత్తానికి ఒక్క tmc అంటే 2830 కోట్ల లీటర్లు.శ్రీ శైలం ప్రాజెక్ట్ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 263.6 tmc లు.
29, సెప్టెంబర్ 2009, మంగళవారం
some good quotations
2. Clever man good but they are not the best.
3. Every man is the architec of his own fortune.
4. The happy only are the truely great.
5. A good heart is worth good.
6. Sweet the help of one we have helped.
7. Real beauty is the beauty of soul.
8. Be sure you are right , then go ahead.
9. Love conque all us too yield to love
10.In friendship there should be no prettence.
11.Beauty is a short - lived reign.
25, సెప్టెంబర్ 2009, శుక్రవారం
గరుడోత్సవం
అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు విక్షేసి స్వామి వారి వైబవాన్ని కనులార దర్శించి పునితులౌతారు.స్వామి వారి వాహన సేవలైన చిన్న శేషు, పెద్ద శేషు , గజ , అశ్వ , హనుమ, గరుడ , కల్పవృక్షం, మత్యాల పల్లకి ,సూర్య ప్రభ , చంద్ర ప్రభ , సింహ , రధోత్సవం మో... అన్ని వాహనాలలో మిక్కిలి ప్రీతి ప్రాయమైన గరుడ వాహనం పై స్వామి వారి వైభవం విక్షించుటకు వెయ్యి కనులైన చాలవు.అత్యంత విలువైన ఆభరణాలతో సర్వాంగ సుందరం గా అలంకరించుకొని తిరుమల గిరిలో విహరించే స్వామి వారి వైభవం చూచువారి జన్మ ధన్యమే కదా.
కనుకనే తిరుమల అన్నా , తిరుమల లడ్డు అన్నా అంతటి ప్రాముఖ్యత.ప్రమోషన్ కావాలన్నా డబ్బుతో జరగని పనులు తిరుమల లడ్డు ఇస్తే జరిగిన సందర్బాలు ఉన్నాయి.
24, సెప్టెంబర్ 2009, గురువారం
ఓ ప్రియ
నీ చూపులలో కరగాలని..
నీ ప్రేమలో మునగాలని..
నీ మనస్సులో మిగలాలని..
నీ ఒడిలో వాలలని..
నీ చేతిలో చెయ్యి వెయ్యాలని..
నీ అడుగుల్లో అడుగేయ్యలని..
యుగ యుగాలు నీతో గడపాలని
నా చిరుకోరిక...
19, సెప్టెంబర్ 2009, శనివారం
విధ్యార్థులు ____ కళాశాలలు
అట్లని విధ్యర్తులదే తప్పు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో? వీటిలో విద్యాసంస్థల తీరూ కూడా దోహదం చేస్తున్నాయి.సద్బుద్ధులు నేర్పించవలసిన గురువులు చేసే అనైతిక చర్యలు కూడా ప్రబావం చూపుతున్నాయి.ఉన్నత విలువలతో విరాజిల్ల వలసిన విద్యాలయాలు కుళ్ళు రాజకీయాలతో బ్రష్టుపడుతున్నాయి.రాజకీయ పలుకు బాడితో అర్హత లేకున్నా విద్యాలయాలలో పదవులు తెప్పించుకొని విద్యార్థులతో వర్గాలు ఏర్పరుచుకొని రాజకీయాలు నడుపుతున్నారు.
యునివర్సిత్య్లలో కమిటి లలో విద్యావంతులు ఎవ్వరున్నారు?విద్య వ్యాప్తికి కృషి చేసే వారు ఏరి? పదవులు కాపాడుకోవడానికి విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నాలు , గొడవలు చేయించే గురువుల నుంచి మంచిని ఆశించడం అత్యాశ ఏమో?లెక్చరర్ ఉద్యోగానికి ఇంత అని రేట్ పెట్టి ఉద్యోగాలు అమ్ముకొనే విద్యాలయాల కులపతులు , లంచం ఇచ్చి చదువులు చెప్పే లక్చరర్లు వీరి నుంచి నేర్చుకొనే మంచి ఎలా ఉంటుంది? వీరే సంగావిద్రోహులు . వీరిని సంస్కరిస్తే గాని మన విద్యాలయాలు ఉన్నత ప్రమాణాలకు నిలయాలు కాలేవు.
ఓ చిన్న విషయం : ఈ విషయం లో అమ్మాయల పాత్ర ను తక్కువ చేయలేము.అవసరం ఉన్నంత వరకు అబ్బాయల్ని వాడుకోవడం అవసరం తీరాక తప్పిచుకు తిరగటం , నిలదీస్తే గొడవ చేస్తున్నాడని కంప్లైంట్ చేయడం.అందరు ఇలాగె ఉంటారని కాదు, కొంత మంది ఇలా చేస్తున్నారు. కాయిన్ బాక్స్ ఫోన్స్ ఎక్కువ అమ్మయలతోనే బిజీ గా ఉంటాయి. ఎందుకు , ఓ తప్పు ఇద్దరి అంగీకారం తోనే జరుగుతుంది. మరి ఎక్కువ అబ్బాయల్ని మాత్రమే ఎందుకు నిందిస్తారు? వేరెవ్వరి జోలికి వెళ్ళని అబ్బాయి ఆ అమ్మాయి మీదే ఎందుకు ద్వేషం పెంచుకుంటాడు? అమ్మాయి , అబ్బాయల్కి కలిపి కౌన్సిలింగ్ కాలేజీ జాయిన్ అయ్యేతప్పుడే ఇస్తే కొద్ది గా పలితం ఉండవచ్చు.
18, సెప్టెంబర్ 2009, శుక్రవారం
ఆడవారి పై అఘాయిత్యాలు
మరో ఘోరం: నిత్యం వేధించే భర్తతో విసిగివేసారి విడాకులు కోరిన భార్య పై కోపం తో అందుకు కారణం మరధలనుకొని పట్టపగలు బస్టాండ్ నందు మరదలిని నరికి చంపిన కసాయి.(మిర్యాల గూడెం)
ఒక ఘోరతిఘోరం:తాగుడు మానమని , రోజు పనికి వెళ్ళాలని హితబోధ చేసిన పాపానికి భార్యను అత్యంత ఘోరంగా రెండు కాళ్ళను కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ మృగం .
ఒక కసాయి:మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఇనుప రాడ్ తో తలపై కొట్టి చనిపోయింధనుకొని పోలీస్ కేసు కు భయపడి ఆత్మ హత్య చేసుకున్నాడో ముర్కుడు (శ్రీకాకుళం జిల్లా)
ఇది ఈ రోజు మాత్రమే కాదు.ఇంచుమించు ఇలాంటి వార్తలు ప్రతిరోజు దినపత్రికలలో చూస్తున్నాము. చదివిన క్షణం మాత్రం అయ్యో అనుకుంటాము.పోలీసులు ఏమిచేస్తున్నారు అనుకుంటారు. సమస్య ఎక్కడనుంచి పుడుతుంది ? దీనికి మూలం ఏమిటి ? అని ఎవ్వరు ఆలోచిస్తున్నారు.ప్రతి సంఘటనకు పోలీస్ కేసు అవుతున్నది.శిక్షలు పడుతున్నాయి.కాని నేరాలు అదుపులో ఉన్నాయా?సమస్యకి మూలకారణం తెలుసుకొని అక్కడి నుంచి మార్పూ తెస్తే తప్ప సమస్యలు సమసిపోవు.ప్రభుత్వాలు , కాని పోలీస్ లు కాని దీన్ని క్రైమ్ గా నే పరిఘనిస్తున్నారు. నేరం చేసిన వాళ్ళలో కొద్ది మంది అనుకోకుండా ఆవేశం లో చేసిన చర్యలే.వారి గతం లో ఎలాంటి నేరచరిత ఉండదు.కాని నేరం చేసుంటారు.అలంటి వారికీ కౌన్సలింగ్ చేస్తే మరే ప్రయోజనం ఉండవచ్చు.చిన్న చిన్న నేరాలకు కూడా జైలు శిక్షలు వేస్తున్నందేనే ఇలాగే జైలు చూసాము ఇకేముంది అలాగే ఉండిపోధం అనుకొనే వాళ్లు కూడా ఉన్నారు.అమ్మాయిల్ని టీజ్ చేసే వారికి సమస్య ఇంచుమించు ఇంటిలోనే ఉంటుంది.
తల్లిదండ్రులు సరిగా పట్టించుకోక పోవడం , ఒంటరితనం గా ఫీల్ కావడం , టీవీ కార్యక్రమాలలో టీజ్ చేయడం కూడా హీరోయిజం గా చూపడం , తనతో ఎవ్వరు ఫ్రెండ్ షిప్ చేయకపోవడం ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిల్ని టీజ్ చేస్తూ మానసిక ఆనందం పొందుతారు.వీరికి శిక్షలు కాదు కౌన్సలింగ్ చేసి సమస్యను ఎత్తి చూపితే కొద్దిగా మరే అవకాసం ఉంది.ఎందుకు ఇలా ఆలోచించారు?ఎంతసేపు జైలు , శిక్షలు మాత్రమే ఆలోచిస్తారు?
17, సెప్టెంబర్ 2009, గురువారం
నిరాశపరచకు నేస్తం
ఆలోచన నీర్విర్యమౌతున్న సమయం లో
ఒక నిశబ్ధం నన్ను విడిచి వెళుతూ
నీ గూర్చి ఆలోచించమంది.
ఏ భావ తరంగాలు నన్ను కదిలించాయూ
ఎప్పటి నుండో తెలియదు కాని,
మనసుకు మౌన భాష నేర్పింది.
బహుశ దానికి న మనస్సు అర్థమైన్దేమో.
సజల నేత్రాల మధ్య నీ రూపం
మసక భారిన ఆలోచనల
మధ్య నిదురబోయింది.కలువ రేకుల వంటి నీ నయనాల లోని కాంతి
నాపై గగన కుసుమాలను వెదజల్లాలని
నీ రాగా మంజిరనాద తరంగిణిలో
ఆదమరచి సేద తీరాలని నీ ప్రతిబింబంన్ని
నా హృదయ దేవాలయంలో ప్రతిష్టించాలని
గడఅంధకారము అలుముకున్ననా హృదయంలో
అమర దీపం వెలిగిస్తవనుకున్నాను,
నన్ను నిరాశపరచకు నేస్తం
13, సెప్టెంబర్ 2009, ఆదివారం
స్విన్ ఫ్లూ
స్వైన్ ప్లు బయటపడిన రోజునుంచి ఎందుకు జాగ్రత్త వహించలేదు?దేశ వ్యాప్తంగా సుమారు వ్యాధి నిర్ధారణ ఐతే ఇప్పటికి తీసుకున్న చర్యలు స్వలమే . నెలలుగా ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు?ముందు జాగ్రత్త చర్య గా వైద్యాన్ని ఎందుకు విస్తరిచలేదు?శాంపిల్ హైదరాబాద్ కి పంపి వ్యాధి నిర్ధారించే సరికి పుణ్యకాలం గడిచిపోతున్నది.ప్రాంతాల వారిగా ఎందుకు ల్యాబ్స్ తెరవలేదు?ప్రైవేటు వైద్య సేవలను ఎందుకు వినియోగించుకోలేదు?
రాష్ట్ర నాయకులకు ఎంతసేపు అధికారం వారికీ ఇవ్వాలి ,వీరికి ఇవ్వాలని ధర్నాలు , సంతకాల సేకరణ కార్యక్రమాలతో సరిపోతున్నది.మరి ప్రజల ఆరోగ్యాన్ని ఎవ్వరు పట్టించుకోవాలి?ప్రజల కోసమే మనము ఉన్నదని ఆలోచించే నాయకులూ ఎవ్వరున్నారు?ప్రజలు ఎన్నుకుంటేనే మనము అధికారం లో ఉంటాము, వారికీ కనీస అవసరాలను తిర్చవలసిన భాద్యత మనది అని ఫీల్ అయ్యే నాయకులూ ఏరి?మరి అలంటి వారికీ ప్రజల ధనముతో సుఖాలు అనుభవించే హక్కు లేదు.వారి జీతం, భద్రత సిబ్బంది,ప్రయాణ చార్జీలు అంతే కాకుండా రోగం వస్తే నిమ్స్ లో లేదా అపోలో లో వైద్యానికి కూడా ప్రజలు చెల్లించే పన్నులే.ప్రతి నాయకుడు ప్రభుత్వహాస్పిటల్కి ఎంతో చేసాము. కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాము అంటున్తరేమరి అక్కడ వారు ఎందుకు వైద్యం చేసుకోరు? వీరికి సకల సౌక్యలను కల్పించిన ప్రజలు మాత్రం కనీస అవసరాలకు అష్టకష్టాలు పడుతుంటే ......................... ఆహా నా భారత దేశమ ఇది మా దౌర్బాగ్యం
ఓ అందమా
వాస్తవం లో బ్రతికే నన్ను ఉహలలో విహరిపచేసావు.
నీ చిరునవ్వుతో నన్ను మతిలేని వాణ్ని చేసావు,
నీ వాలు జడతో నన్ను బందిచేసావు,
నీ అందాలకు నన్ను ప్రేమ పూజారిని చేసావు,
నీ నామ స్మరణతో జపమే చేయించావు,
కళ్లు మూసినా కలలో కనిపించి కవ్విస్తావు,
ఇలలో మాత్రం దూరంగా ఉంచి ఇరుకున పెడతావు,
నీ అయస్కాంత చూపులతో నన్ను ఆకర్షిస్తావు,
నీ దరికి చేరెంతలో నేవే దురమౌతవు,
నా హృదయం దోచుకొని నన్ను హృదయం లేని మనిషిని చేసావు,
ఓ ప్రేమ నీకు నా జోహార్లు
చిన్ని కవిత
గులాబీ పువ్వు పూసిన మల్లెవాసన తాకిన
మంచుతెరలు చూసినా వాన చినుకు తాకిన
నీవు గుర్తుకు రాని క్షణం లేదు.....తలవని దినము లేదు.
చిన్ని కవిత
--ఇది మనసుకు ఆనందం.
నిజమైన స్నేహితుడు అనురాగాన్ని,ఆత్మీయతను పంచుతాడు.
--ఇది జీవితానికే ఆనందం.
@@@@@@@&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
పరిచయం అనే చెట్టుకి అనురాగం అనే నీరు పోస్తే స్నేహమనే పువ్వు పూస్తుంది
ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది.ప్రేమను ప్రేమించే ప్రేమను ప్రేమ కే ప్రేమించడం నేర్పుతుంది .ప్రేమకే ప్రేమించడం నేర్పే ప్రేమ ప్రేమకు కష్టాలను తెస్తుంది.కష్టాలను తెచ్చె ప్రేమ , కష్టాలను కూడా ప్రేమించే ప్రేమను ప్రేమిస్తంది.కష్టాలను కూడా ప్రేమించే ప్రేమ కొరకు ప్రేమ ఏమైనా చేస్తుంది.
జోక్
'ఎవ్వరి ప్రక్కన ఉండను.వాళ్లు విసిరే వస్తుఉలు నాకు తగలకుండా తలుపు ప్రక్కన ఉంటాను.' అన్నాడు అరుణ్.
12, సెప్టెంబర్ 2009, శనివారం
7, సెప్టెంబర్ 2009, సోమవారం
4, సెప్టెంబర్ 2009, శుక్రవారం
అభిమానం
నిన్నటి పేపర్ లో చదివాను ముఖ్యమంత్రి గారి మరణం తరువాత సుమారు ౩౦౦ మంది చనిపోయారని.ఏందిది.అభిమానానికి ఓ హద్దు ఉండాలి.నిన్ను నమ్మిన నీ బార్య , పిల్లలు ఎమౌలి ?ఇప్పుడు , అప్పుడు కింది స్థాయి కార్యకర్తలే చనిపోతారు.అదే మీ పై నాయకుడు చనిపోడే? వారివైతే ప్రాణాలు , మీ వైతే గడ్డి పుల్లలా?దయసేచి మీరు గమనించండి , మీ పై ఆధారపడిన వారిని గుర్తుచేసుకోండి.దయసేచి అగేత్యలు చేయకండి.
ఎవ్వరి కోసం మీరు త్యాగాలు చేయాలి? వారు మీ కూడా పుట్టిన వారా? లేక మీ బాగోడులు చుసేవారా?మంచి కోసం త్యాగం చేయండి. అంతే కాని ఎవ్వరో లాభపడేందుకు మీరు త్యాగాలు చేస్తే మీ కుటుంభం అధోగతి అవుతుంది.
దయ చేసి ఆలోచించండి.చేతనైతే చుట్టుపక్కల వారికి సహాయపడండి.నీ సహాయం పొందిన వారు నిన్ను సదా స్మరించుకుంటారు.మీ నాయకులకు మీమల్ని పట్టించుకొనే తీరిక ఉండదు.కావాలంటే చినిపోయిన వారి పేర్లు కొన్ని చెప్పమనండి.తెలుస్తుంది.
అశ్రూనివాలి
ప్రజల నుంచి ఎదిగి , ప్రజల మధ్య మెదిలి ,ప్రజల వద్దకు పయనమైన రెడ్డి గారు ఆ ప్రజలను చేరకనే వెళ్ళిపోయారు.రచ్చ బండ వద్ద కొలువుధీర వలసిన ముఖ్యమంత్రి ,'ఎవ్వరికి చెప్పకుండా ఆకస్మికమగా వేల్తునానని " చెప్పిన ముఖ్యమంత్రి ఎవ్వరికి చెప్పక ఒంటరిగా వెళ్లి స్వర్గలోక సింహాసనంలో అసీనులినారు.నిత్యం వినూత్న పథకాలతో ,నిరంతరము రైతుల అబ్యున్నతికి పాటుపడే వీరిని చూసి దేవతలకి కన్నుకుట్టిందేమో ?లేక ప్రజలు అభివృద్ది చేన్దితే దేవతలను స్మరించారని అనుమానపడ్డరేమో?లేక దేవేంద్రుని పాలనా విసుగు పుట్టిందేమోమరి రాష్ట్ర ప్రజలను అనాధలుగా వదలి ఆయనను తిసుకోనివేల్లిపోయారు.
అయన అదృశ్యం ఐనప్పటినుంచి లక్షల మంది చేసిన ప్రధానాలు దేవతల చెవి చేరిన వారి స్వార్థంతో నిర్దయగా ఆయన్ను తిసుకోనివేల్లిపోయరే ,వీళ్ళు నిజం గానే దేవతలా?
దేవుళ్ళు నిజంగా ఉంది ఉంటే ఆయన్ను క్షేమంగా తిసుకోనివచ్చి అప్పగించి ఉండేవారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో పదిల స్థానం ఏర్పరుచుకున్న నాయకుడు , తన చిరకాల స్వప్నం ఐన జలయజ్ఞం పూర్తి చేయకనే అనంతలోకాలకు వెళ్ళిపోవడం ఆంధ్ర రాష్ట్ర పరకాల దురదృష్టం.నిన్ను నమ్మిన జనాన్ని కన్నీటికడలిలో వదలి అనంతలోకాలకు పాదయాత్ర చేస్తున్నావా?లక్షల హృదయాల సింహాసనం లో కొలువైన నీవు ఆ దేవేంద్రుని సిహ్మసనమైన వదలి నీ ప్రజల కోసం ఆ స్వర్గనైన దిగిరా.పాదయాత్రతో ఓ మహాప్రస్థానం సృష్టించిన నీవు ,నీ అంతిమ యాత్ర కూడా చరిత్రే . కోట్లాది జనం ఎలుగెత్తి క్షేమంగా నల్లమల అడవులనుంచి రావైయ్యా అన్నారే , మాట తప్పను....మడమ తిప్పాను అన్నవే,అనుకున్నది ప్రళయం వచ్చిన తలవంచని దీరసాలివె నీవు విధి ముందు ఓడిపోవడం ఎంతటి విషాదకరం.
కాంగ్రెస్ కాదు , తెలుగు దేశం కాదు , ప్రజారాజ్యం కాదు అందరి పార్టి ప్రజలు ముక్తకాంతం తో గోశించార్ఈ రావయ్య రాజశేఖర నీవు క్షేమంగా రావయ్య అని . అదిచాలదా నీ జన్మకు సార్థకత.
అరవై సంవత్సరాలకు విరమణ చేస్తానని అనుకోకుండా చెప్పి అట్లే అరవై అవ్వగానే వెళ్ళిపోయవా ? రావయ్యా రాజశేఖర నింగిని చిల్చేకొని ఐన నీ ప్రజల కోసం , రాష్ట్ర ప్రభుత్వ సారధి గా రా...నీలాంటి నాయకుడిని పోగొట్టుకొని ఆంధ్ర రాష్ట్రము సోకసముద్రం లో మునిగిపోయింది.....
నీవెక్కడున్నా మా హృదయాలలో చిరస్థానంగా నిలిచిఉంటావు.మరణం భౌతికంగా గాని నీ ఆత్మ ఎప్పుడు మాపైఉంతుంది.జోహార్ రాజశేఖరా...............................నీవు జన హృదయాలలో అమరుడవు..... రైతుల గుండెచప్పుడు నీవే .............వాన దేవుడు మా పార్టి అని గర్వం గా చెప్పేవే మరి ఆ వాన దేవుడే నిన్ను పొట్టన పెట్టుకున్నదే
1, సెప్టెంబర్ 2009, మంగళవారం
నాయకులూ .............. జనము
జోకులు
గురువు:శిష్యపూజను ఇక్కడికి తీసుకొని రా నాయన.ఇద్దరికి తయోత్తు కట్టి దోష నివారణ చేస్తాను.అన్నాడు పరధ్యానం గా.
>>>...........................>>>>>>>>>>>>>>>...............................>......................>>>>>>>>>>>>>..
ఆపిల్ ,ద్రాక్ష , అరటి పళ్ళు ఓ చోట చేరి సాధక బాధలు ముచ్చతిన్చుకొంతున్నై.
ఆపిల్: జనం నన్ను ఇంటికి తీసుకొని వెళ్లి శుబ్రంగా కడిగి కత్తితో కోసుకొని తింటారు.
ద్రాక్ష:నన్ను కూడా కడిగి అలాగే నోట్లో వేసుకొని చప్పరితారు.
అరటి ఏమి చెప్పక పోయేసరికి ఆశ్చర్యంగా చూసాయి.
అరటి:ఏమి చెప్పమంటారు?ఈ దిక్కుమాలిన జనం న బట్టలు విప్పకుండా నన్ను తినలేరు కదా అంది సిగ్గుతో .
వలసలు
అలాగే మన రాష్ట్రము లో కరువు తీవ్రం గ ఉన్నా పరిస్థితిలో వ్యవసాయ కులిలను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా వలసల్ని కొద్దిన నివరించింది.కాని మన రాష్ట్రము లోని రాజకీయ నాయకులూ ఓ పార్టి పేరు చెప్పి ఎన్నికల్లో నిలబడి , ప్రజలకు సేవ చేస్తామని ఓట్లు వేయించుకొని,గెలిచి ప్రజల తరపున నిలబడి అన్యాయని నిలదీయవలసిన నాయకులూ వేరే, పార్టి చూపిన ప్రలోభాలకు లొంగడం ఎంత వరకు సమంజసం? టికెట్ ఇచ్చిన పార్టి ని విమర్శించే ముందు , ఆరోజు టికెట్ ఇచ్చిన అధినేత గూర్చి , సిద్ధాంతాల గూర్చి తెలియకుండానే అ పార్టి తరపున నిలబద్దరా?
అభిప్రాయ బేధాలు ఎక్కడైనా ఉంట్టాయి.దాన్ని కలసి చర్చించు కోవాలి గాని విమర్శించడం ఎంత వరకు సమంజసం?
తామందరం గెలిస్తే పార్టి నేత ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారని తెలియదా? పార్టి నేత సరిలేనప్పుడు పోతిచేయకుడదు?
అంటే అ ప్రాంతం లో మేత అధికం ఉందన్న మాట.నైజీరియా నుంచి ఇండియా కు వలస వచ్చే పక్షులు ఎక్కడ అ ప్రాంత న్ని విమర్సిన్చినట్లు ఈ ఒక్కరు చెప్పలేదు.అలాగని ఈ ప్రాంతాన్ని పొగడను లేదు.మరి ఆ పక్షులకున్న జ్ఞానం కూడా మన నాయకులకు లేకపోవడం మన దురద్రుష్టం.
26, ఆగస్టు 2009, బుధవారం
మన దేశం ______ మన నాయకులూ
ఇంకోక్కరు ఎప్పుడో జరిగిన విషయాలతో పుస్తకం వ్రాసి సంచలనం చేసి లాభాలు చేసుకుంటారు. విరా దెస సేవ చేసేది?వీరు జిన్నా కి సమకలికూడా?లేక పటేల్ కి జేద్ది దోస్త? ఇయ్యన గారి పుస్తకం వల్ల దేశానికీ జరిగే మేలు ఏంది?ఆయనగారికి లాభాలు తప్ప?అప్పటి నాయకుల వల్ల ఈరోజు మనకి స్వతంత్రము వచ్చి హాయీగా ఉన్నాము.అప్పుడు వాళ్లు సర్వం త్యాగం చేసి ప్రజలకు మంచి జరగాలని చేసే ప్రయత్నం లో కొన్ని మంచి జరగవచ్చు. కొంచం చెడు జరగవచ్చు.లేదా వాళ్లు ఉహించింది జరగకపోవచ్చు.అంతేగాని వాళ్ళను దోషులుగా చేయలేము.శవపేటిక లలో కుడు కామిసిన్ తేనె నేటి నాయకుల్లా కాకుండా ,నీతి
నిజాయతి ఉన్నా నిఖార్సైన నాయకులూ. అలంటి నాయకులను విమర్శించే ముందు తన వైపు కూడా చూసుకోవాలి.వీరు తీవ్రవాదుల్ని స్పెషల్ ప్లైట్ లో కాందహార్ లో వదలివచ్చారు.వాళ్లు ఎంతమంది ని చంపారో అల్లోచించారా?అవి ఏవి గుర్తుండదు.ఎందుకంటే చనిపోయిన వారు వీరికి బంధువులు కారు.అదే వీరి చంపివుంటే దేశానికీ ఎంతో బాగుండేది.ఈ నాయకులూ ఇట్లా ఉండబట్టే తీవ్రవాదులు అల రెచ్చిపోతున్నారు. వీలను కిడ్నాప్ చేసి వాళ్ల మనుషుల్ని వదలమంటే దేశం లో ఏ ఒక్క మనిషి కూడా ఒప్పుకోదు.
22, ఆగస్టు 2009, శనివారం
అసెంబ్లిలో మన నాయకులూ
18, ఆగస్టు 2009, మంగళవారం


14, ఆగస్టు 2009, శుక్రవారం
నేటి రాజకీయాలు
ఉచిత కరెంటు:
నేటి రాజకీయ నాయకులూ ఇస్తున్నహామీలు చూస్తుంటే వీళ్ళు ప్రజలను సోమరి వాళ్ళుగా తాయారు చేస్తోన్నారో లేక ప్రజలను అబివృద్ధి పరుస్తున్నారో తెలియడం లేదు?
ఈ ఉచిత కరెంటు వల్ల ఉపయోగం ఎంత ?ప్రయోజనం పున్దుతున్న దెంత? నిధులు ఎవ్వరు బరిస్తున్నదేవ్వరు?
ఈ ఉచిత కరెంటు వల్ల ఖచ్చితం గా ప్రయోజనం రైతులకే. కొన్ని కోట్లు కర్చు చేసి రైతు కి ఉచితం గా ఎందుకు ఇవ్వాలి? కేటా ఇంచే ఉచిత కరెంటు కి రాష్ట్ర ప్రజలందరు చెల్లించిన పన్నులు వాటిని ౩౦% ఉన్నా రైతులకే ఎందుకు ఇవ్వాలి?
ఆహార బద్రత కొరకు అని చెప్పవచు . ఉచిత కరెంటు వల్ల పెరిగిన పంట విస్తీర్ణం ఎంత? కరెంటు ఉచితం గా పొంది మల్లి మద్దతు ధర పెంచి రైతులకే మల్లి మల్లి ప్రయోజనం కల్పిస్తున్న ఆత్మ hathyalu ఎందుకు చేసుకొంట్టున్నారు? రాష్ట్ర ప్రజలు విద్యుత్ కి నిధులు బరించాలి మల్లి అధిక ధరలకు ఆహర ధాన్యాలు కొనుకోవాలి ఏది ఎంత వరకు సమంజసం? ఎక్కడ ఉంది లోపం ? ఏది ఎవ్వరు చేసిన శాపం ?
ప్రస్తుత కరెంటు సంక్షోబానికి కచ్చితం గా ఉచిత కరెంటు ఇవ్వడం వల్లే. ఉచితం కాబట్టి పొదుపుగా వడక వృధా చేసినందునే , ప్రస్తుతం కరెంటు చాలక , నీళ్లు లేక పంటలు లేక రైతు లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు?
ఇది ఖచ్చితం గా మనము చేసుకున్న పాపం.ముందు చూపు లేని నాయకుల వల్ల జర్గుతున్న నష్టాలే ఇవి. నిజం గా రైతుల మీద ప్రేమ ఉంటే విత్తనాలు అందుబాటులో ఉంచవచ్చు.ఎరువులు అందించవచ్చు. ఇవి ఏమి చేయక ఉచితకరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వాలు జరుగుతున్న ఆత్మ హత్యల గూర్చి ఎందుకు చెప్పడం లేదు.
వర్షాలు పడక ప్రజలు అల్లాడుతుంటే నాయకులూ వానదేవుడు మా పార్టి వాడు అని చెప్పే నాయకుడు మరి వర్షాలు ఇమ్మని ఎందుకు అగ్నపించలేదు? అంటే వర్షాలు వస్తే నా గొప్ప, లేక పోతే ప్రతిపక్షాల వల్ల రాలేదని చెప్పడం? ప్రజలు కోరుకుంటున్నది ఉచితం కాదు, కరెంటు కాని, యురియ గాని , విత్తనాలు గాని అందుభాటులో ఉండటం.ఉచిత కరెంటు ఒక గంట ఇచ్చి ఉచాతం గా ఇచ్చమంటే దానికన్నా పూర్తిగా ఇవ్వక పోవడమే మేలు.
జల యజ్ఞం , జలయజ్ఞం అంటు ఉదర గోడుతున్నారే మరి వర్షాలే లేకపోతే ప్రాజెక్ట్ లు నిండేది ఎలా ?వర్షాలు పడేందుకు కోట్లు పెట్టి మెగామధనం బదులు వనాలు , అడవులు అభివృద్ది చేస్తే వర్షాలు సకాలమ లో కురుస్తాయి.ప్రాజెక్ట్ లు నిండుతాయి.
మన బడ్జెట్ : లక్ష కోట్లు
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...




