25, మార్చి 2011, శుక్రవారం

వారసత్వ రాజకీయాలు ___ అవినీతికి మూలాలు.

మన దేశ రాజకీయ ప్రక్షాళన జరగాలంటే, అవినీతిని నిర్ములించాలంటే ముందు అత్యవసరంగా చేయవలసిన పని వారసత్వ నాయకులను తిరస్కరించడం.తండ్రి అధికార నీడలో వారసులందరుకోటను కోట్లకు పడగలెత్తిన వారే. మరి ఎందుకు మల్లి రాజకీయాలకు వస్తున్నారు? ఇంకా దోచుకోనేందుకే గాని ప్రజాసేవ చేసే నాయకులూ మచ్చుకైన కనబడడం లేదు.వారసత్వ రాజకీయాలకు ఆద్యుడు నెహ్రు. తనంతరం అధికారం , ప్రభుత్వ సౌకర్యాలు , తన ఆస్తులు మొత్తం ఇందీర గాంధికి అప్పగించి తొలి వారసత్వ అధికార బదిలి చేసి అవినీతికి శంకుస్థాపనచేసాడు. అక్కడికే ఈ బదిలి నిలిచిపోలేదు. ఇందీర విధించిన ఎమర్జెన్సి సమయంలో జరిగిన అవినీతిలో ప్రధాన పాత్ర సంజయ్ గాంధిదే . ఆ తరువాత రాజీవ్ గాంధి , మల్లి రాజీవ్ గాంధి శ్రీమతి సోనియా గాంధి ప్రభుత్వం లో చేరకున్న,అధికారాన్ని నియంత్రిచడంలో , రాహుల్ గాంధిని భావి ప్రధాని చేయడంలో , అవినీతికి ఉతమివ్వడంలో ప్రధాన పాత్ర.
మన రాష్ట్రములో కూడా ఈ జాడ్యం ఉంది. రాజశేఖర్ రెడ్డి అధికార నీడలో జగన్ అవినీతి ఎన్ని వేల కోట్లో లెక్క చెప్పే స్థితి లేదు.అలాగే తమిళ నాడులో కరుణానిధి అధికార దర్బారులో స్టాలిన్ దే పై చేయి. విలక్షణమైన పార్టిగా చెప్పుకొనే బిజెపిలోకూడా అవినీతిలో అంత ఒక్క తను ముక్కలే అని కర్ణాటకలో తేలిపోయింది.ఇక మన రాష్ట్రంలోనే బొత్స ఫ్యామిలీ మొత్తం రాకీయాలలో వేల్లునుకుపోయింది.కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా,కర్ణాటకలో కుమారస్వామి గౌడ,ఒరిస్సా లో నవీన్ పట్నాయక్, మహారాష్ట్రలో అశోక్ చవాన్ మొదలైన వారు వారసత్వ రాజకీయాలతో పదవులనుభావిన్వ్చిన వారే.వారి తండ్రులు కూడా ముక్యమంత్రులుగా ఏలిన వారే.వారసులుకుడా ముక్యమంత్రి పదవి కూడా వారసత్వ అస్తిగానే అనుభవిస్తున్నారు.పూర్వం రాజ్యలనేలే రాజులూ తనంతరం వారసులను సింహాసనం పై కుర్చోపెట్టేవారు. ప్రస్తుతం రాజ్యాలు పోయినా ఇంకా మంత్రులు ఉన్నట్లు ముక్యమంత్రి పదవి తమ అనమ హక్కు గా, వారసత్వ ఆస్తిగా భావించే వారసులను ప్రజలు ఎన్నుకోవడం అంటే అవినీతికి లైసెన్సు ఇవ్వడమే.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...