10, అక్టోబర్ 2009, శనివారం

ఇస్రో పంపిన చంద్రయాన్ ద్వార చంద్రుడినందు నీటి జాడలు ఉన్నాయన్న నిజం తెలియగానే మల్టి నేషన్ కంపినీలు మల్టి ప్లానిటరీ కంపెనిలుగా పేరు మార్చుకొని ముందుగా చంద్రుని పై కంపెనీ లు స్థాపించడానికి రుణ సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇస్రో , నాస మొదలైన అంతరిక్ష పరిశోధన కేంద్రాలు మానవాస గృహాలకు నమూనాలు రూపొందించడం మొదలుపెట్టాయి. విషయం అంత గ్రహించిన చంద్రుడు నాసా కి లేఖ పంపాడు.
విషయం చంద్రుడికి ఎలా తెలిసిందని సందేహమా?అక్కడి విషయాలు మనకి తెలియగా లేనిది ఇక్కడి విషయాలు చంద్రుడికి తెలియవా? చంద్రుడి నుంచి లేఖ వచ్చిందని తెలియగానే ప్రపంచ వ్యాప్తంగా అందరు అందులోని విషయం తెలుసుకోవడానికి ఉత్కంటతో ఎదురు చూస్తున్నారు.వారం , పది రోజులు ప్రయత్నిస్తున్న అందులోని గుర్తులు , సంకేతాలు అర్థం కాకా ఇంటర్నెట్ లో , టీవీ లలో డీకోడ్ కి ప్రయత్నించామని ప్రచారం చేసారు.ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించి విపలమైనారు. అలాంటి పరిస్థితిలో మానసిక శాస్త్రవేత్త , గుండె నిపుణుడు కలసి చిరు ప్రయత్నం గా
దేకోడ్ కి ప్రయత్నిస్తుటే అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంతో కష్టపడితే దాని సారాంశం ఎలా ఉంది.
"ప్రియమైన అల్లుల్లరా(చందమామ అంటాము కాబట్టి)! అన్ని గ్రహలము కలసి మీరు ఉండేందుకు సమస్త వసతులతో భూమిని తయారు చేసి ఇస్తే స్వార్థం తో దానిని కాలుష్యం చేసుకొని అష్టకష్టాలు పడుతున్నది చాలక

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...