నేటి విద్య సంస్థలు విద్య కేంద్రాలుగా విరాజిల్లుట లేవు. నేటి విద్యార్థులే రేపటి భారత దేశరూప కర్తలు ఇది ఓ సూక్తి.కాని వాస్తవంగా నేటి విద్యార్థులే రేపటి నేరస్తులుగా ప్రవర్తిస్తున్నారు.ఇది కోపం తో చెబుతున్న విషయం కాదు.వాస్తవం గా జరుగుతున్న పరిణామాలకు వ్యధ చెంది వ్రాస్తున్న కఠోర నిజం.యాసిడ్ దాడి గానిఅమ్మాయల గొంతు కోయడలు గాని, ప్రేమించమంటూ వేధించడం గాని, ఈవే టీజింగ్ గాని అధిక బాగం విధ్యర్తులదే.
అట్లని విధ్యర్తులదే తప్పు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో? వీటిలో విద్యాసంస్థల తీరూ కూడా దోహదం చేస్తున్నాయి.సద్బుద్ధులు నేర్పించవలసిన గురువులు చేసే అనైతిక చర్యలు కూడా ప్రబావం చూపుతున్నాయి.ఉన్నత విలువలతో విరాజిల్ల వలసిన విద్యాలయాలు కుళ్ళు రాజకీయాలతో బ్రష్టుపడుతున్నాయి.రాజకీయ పలుకు బాడితో అర్హత లేకున్నా విద్యాలయాలలో పదవులు తెప్పించుకొని విద్యార్థులతో వర్గాలు ఏర్పరుచుకొని రాజకీయాలు నడుపుతున్నారు.
యునివర్సిత్య్లలో కమిటి లలో విద్యావంతులు ఎవ్వరున్నారు?విద్య వ్యాప్తికి కృషి చేసే వారు ఏరి? పదవులు కాపాడుకోవడానికి విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నాలు , గొడవలు చేయించే గురువుల నుంచి మంచిని ఆశించడం అత్యాశ ఏమో?లెక్చరర్ ఉద్యోగానికి ఇంత అని రేట్ పెట్టి ఉద్యోగాలు అమ్ముకొనే విద్యాలయాల కులపతులు , లంచం ఇచ్చి చదువులు చెప్పే లక్చరర్లు వీరి నుంచి నేర్చుకొనే మంచి ఎలా ఉంటుంది? వీరే సంగావిద్రోహులు . వీరిని సంస్కరిస్తే గాని మన విద్యాలయాలు ఉన్నత ప్రమాణాలకు నిలయాలు కాలేవు.
ఓ చిన్న విషయం : ఈ విషయం లో అమ్మాయల పాత్ర ను తక్కువ చేయలేము.అవసరం ఉన్నంత వరకు అబ్బాయల్ని వాడుకోవడం అవసరం తీరాక తప్పిచుకు తిరగటం , నిలదీస్తే గొడవ చేస్తున్నాడని కంప్లైంట్ చేయడం.అందరు ఇలాగె ఉంటారని కాదు, కొంత మంది ఇలా చేస్తున్నారు. కాయిన్ బాక్స్ ఫోన్స్ ఎక్కువ అమ్మయలతోనే బిజీ గా ఉంటాయి. ఎందుకు , ఓ తప్పు ఇద్దరి అంగీకారం తోనే జరుగుతుంది. మరి ఎక్కువ అబ్బాయల్ని మాత్రమే ఎందుకు నిందిస్తారు? వేరెవ్వరి జోలికి వెళ్ళని అబ్బాయి ఆ అమ్మాయి మీదే ఎందుకు ద్వేషం పెంచుకుంటాడు? అమ్మాయి , అబ్బాయల్కి కలిపి కౌన్సిలింగ్ కాలేజీ జాయిన్ అయ్యేతప్పుడే ఇస్తే కొద్ది గా పలితం ఉండవచ్చు.
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...