ప్రేమ పేరు తో ఉన్మాది :ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఒక సంవత్సర కాలం వేధిస్తుంటే విసిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఓ నిర్బగ్యురలిని జైలు నుంచి బెయిల్ పై వచ్చిన ఉన్మాది కత్తితో అమ్మాయి కుటుంబం పై దాడి చేసి అమ్మాయిని తీవ్రం గా గాయపరచి తల్లిదండ్రులను బలితీసుకున్నాడు.(రాజమండ్రి)
మరో ఘోరం: నిత్యం వేధించే భర్తతో విసిగివేసారి విడాకులు కోరిన భార్య పై కోపం తో అందుకు కారణం మరధలనుకొని పట్టపగలు బస్టాండ్ నందు మరదలిని నరికి చంపిన కసాయి.(మిర్యాల గూడెం)
ఒక ఘోరతిఘోరం:తాగుడు మానమని , రోజు పనికి వెళ్ళాలని హితబోధ చేసిన పాపానికి భార్యను అత్యంత ఘోరంగా రెండు కాళ్ళను కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ మృగం .
ఒక కసాయి:మద్యం మత్తులో భార్యతో గొడవ పడి ఇనుప రాడ్ తో తలపై కొట్టి చనిపోయింధనుకొని పోలీస్ కేసు కు భయపడి ఆత్మ హత్య చేసుకున్నాడో ముర్కుడు (శ్రీకాకుళం జిల్లా)
ఇది ఈ రోజు మాత్రమే కాదు.ఇంచుమించు ఇలాంటి వార్తలు ప్రతిరోజు దినపత్రికలలో చూస్తున్నాము. చదివిన క్షణం మాత్రం అయ్యో అనుకుంటాము.పోలీసులు ఏమిచేస్తున్నారు అనుకుంటారు. సమస్య ఎక్కడనుంచి పుడుతుంది ? దీనికి మూలం ఏమిటి ? అని ఎవ్వరు ఆలోచిస్తున్నారు.ప్రతి సంఘటనకు పోలీస్ కేసు అవుతున్నది.శిక్షలు పడుతున్నాయి.కాని నేరాలు అదుపులో ఉన్నాయా?సమస్యకి మూలకారణం తెలుసుకొని అక్కడి నుంచి మార్పూ తెస్తే తప్ప సమస్యలు సమసిపోవు.ప్రభుత్వాలు , కాని పోలీస్ లు కాని దీన్ని క్రైమ్ గా నే పరిఘనిస్తున్నారు. నేరం చేసిన వాళ్ళలో కొద్ది మంది అనుకోకుండా ఆవేశం లో చేసిన చర్యలే.వారి గతం లో ఎలాంటి నేరచరిత ఉండదు.కాని నేరం చేసుంటారు.అలంటి వారికీ కౌన్సలింగ్ చేస్తే మరే ప్రయోజనం ఉండవచ్చు.చిన్న చిన్న నేరాలకు కూడా జైలు శిక్షలు వేస్తున్నందేనే ఇలాగే జైలు చూసాము ఇకేముంది అలాగే ఉండిపోధం అనుకొనే వాళ్లు కూడా ఉన్నారు.అమ్మాయిల్ని టీజ్ చేసే వారికి సమస్య ఇంచుమించు ఇంటిలోనే ఉంటుంది.
తల్లిదండ్రులు సరిగా పట్టించుకోక పోవడం , ఒంటరితనం గా ఫీల్ కావడం , టీవీ కార్యక్రమాలలో టీజ్ చేయడం కూడా హీరోయిజం గా చూపడం , తనతో ఎవ్వరు ఫ్రెండ్ షిప్ చేయకపోవడం ఇలాంటి పరిస్థితిలో అమ్మాయిల్ని టీజ్ చేస్తూ మానసిక ఆనందం పొందుతారు.వీరికి శిక్షలు కాదు కౌన్సలింగ్ చేసి సమస్యను ఎత్తి చూపితే కొద్దిగా మరే అవకాసం ఉంది.ఎందుకు ఇలా ఆలోచించారు?ఎంతసేపు జైలు , శిక్షలు మాత్రమే ఆలోచిస్తారు?
అందరికి వందనాలు ...... నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులకు ,బంధువులకు ,శ్రేయోభిలాషులకు వందనాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం.... విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు మనం సేకరించిన...
-
రతిక్రీడలో ఆచరించాలంటే వాత్సాయనుడు చుచిన్హిన 64 భంగిమలున్నాయి. రతిక్రీడ అంటే చాలామంది ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టం వచ్చినట్లు తమ శరీరాల...
-
మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి