ప్రేమంటే తెలియని నాకు ప్రేమ రుచి చూపావు,
వాస్తవం లో బ్రతికే నన్ను ఉహలలో విహరిపచేసావు.
నీ చిరునవ్వుతో నన్ను మతిలేని వాణ్ని చేసావు,
నీ వాలు జడతో నన్ను బందిచేసావు,
నీ అందాలకు నన్ను ప్రేమ పూజారిని చేసావు,
నీ నామ స్మరణతో జపమే చేయించావు,
కళ్లు మూసినా కలలో కనిపించి కవ్విస్తావు,
ఇలలో మాత్రం దూరంగా ఉంచి ఇరుకున పెడతావు,
నీ అయస్కాంత చూపులతో నన్ను ఆకర్షిస్తావు,
నీ దరికి చేరెంతలో నేవే దురమౌతవు,
నా హృదయం దోచుకొని నన్ను హృదయం లేని మనిషిని చేసావు,
ఓ ప్రేమ నీకు నా జోహార్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి