15, సెప్టెంబర్ 2011, గురువారం

తమాసా

 వార్త పత్రికలలో హెడ్డింగ్స్ తో కొద్దిగా కామెడీ చేస్తే ఎలా ఉంటుందన్న చిన్న ఉహే ఈ పోస్ట్ .ఎవ్వరి మనసును నొప్పిస్తే క్షమించా ప్రార్ధనా.
12/09/2011 నాటి ఆంధ్ర జ్యోతి పత్రికలోని వార్తలు , 
 భాలయ్య రాజకీయం ---- తెలంగాణ అసంభవం 
సుప్రీం జడ్జి గా తెలుగు తేజం ------ అమెరిక నిర్ధారణ 
మహా మాయ ---- పధకాల మాటున హంపాట్ 
జన గర్జన ----- అవును అది భ్రమే 
అప్పులు తీరితే జనం లోకి ------ మేమంతా మీ వెంటే 
పోటికి వస్తున్న ------- తమిళ నాడు లో అల్లర్లు,విధ్వంసం 
కృష్ణ జలాల పై రాష్ట్రానికి న్యాయం కోసం ప్రధాని ఎదుట ఎంపిలు ధర్నా చేయాలి---శాంతించిన కృష్ణమ్మా
కొండపై పోలీసు కన్ను ----- అత్యసకు పోతే అంతే 
 తెలంగాణ స్వార్థపరులు ---- ఘనం గా నిమర్జనం 
ఇక  16/09/2011 తేదిన జ్యోతిలో 
లారీలో 5 కోట్లు గాలి కరెన్సీ -------చెరసాలకు నూకారపు ----- గాలి బేజారు 
భోగ్గు....భగ్గు------తెలంగాణ తేల్చేస్తారు------- సీయం  పధకం 
యద్యురప్పకు ముందస్తు  బెయిలు-----నిరసనగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా 
అనంతలో మంత్రుల ఘోరావ్ -----భాలాత్కారం కేసు నమోదు 
ఇంతకి రేపు...... ఎదినం ------అత్యంత హింసాత్మకం 
తెలంగాణ తేల్చేస్తారు ----పరిస్థితి మెరుగయ్యేవరకు కోతల కాలం
గాలి డబ్బు కు రెక్కలు ------ ధర భార(త)౦ 
సకల టిచర్ల సమ్మె ----భాద్యతారహితం
పేలిన పెట్రో బాంబు ------ వివేకం తో కూడిన నిర్ణయం 
                                                              
                                                          ఇలా ఉంటాయి వార్తలు సరదాగా ఉంటె తెలపండి ఈ శీర్షికని కొనసాగిద్దాం

                                               ఆంద్ర జ్యోతి  25/03/2012


డిల్లి లో రచ్చ బండ  --- నాణానికి మూడో వైపు
సర్కారీ కబ్జా --- ఇంత తక్కువా?
దేశం ఉప సమీకరణం  ----- ఎమెల్యే అపహరణ
ఎన్డియే లో బిన్న గళాలు ----నేతలు జాగ్రత్త
పరీక్షా హలో బట్టలు విప్పించారు ---- మరో విద్యార్థి ఆత్మ హత్యా
రాజకీయ రచ్చ  ----- అందుకే ఓడిపోయం
సియల్పిలో  యుద్ధ సీను ---- శంకర రావు కు మతి భ్రమించింది


                                                 
                                               సాక్షి లో  25/03/12
మున్ముందు కఠిన నిర్ణయాలే  ---- కొంచెం లేటు
మరో విద్యార్థి ఆత్మ హత్యా --- అత్మహత్యలంధ్ర ప్రదేశ్
పేదల సంఖ్యా ముమ్మాటికి తగ్గింది---- త్వరలో గ్రీర్న్ ఎనర్జీ తో రైళ్ళు పరగులు
ఉద్దేశాపూర్వకంగా శృంగారాన్ని నిరాకరిస్తే విడాకులివ్వొచ్చు---- ఐ రా స తీర్మానం లో సమతూకం తెచ్చాం
త్వరలోనే సువర్ణ యుగం ---- సి ఏం ను దించాలని కుట్రలు
ఆ గదిలో ఏముంది...? --- గుప్తా నిధుల వద్దంతులు
రోడ్లకు తప్పని గ్రహణం ...? --- బస్సు దిగితూ విద్యార్థి మృతి        


16/08/2012              ఆంధ్ర జ్యోతి 

బలి పీట పై                  ------   'పంచ ' వర్ష ప్రణాళిక 
తెలుగు దేశం తెలంగాణకు అనుకూలం        ------         ఇరుక్కుపోయారు 
నాన్చుడు లేదు.... తెల్చుడే       --------    'డీ ' ఎస్సీ 
తన ప్రాణాలు పోతున్న   -----   సెల్ రేడియేషన్ కు పగ్గాలు 
డిల్లీ  రాష్ట్ర పక్షి గా 'పిచ్చుక'  ---- అమెరికాలో జరా భద్రం 
హక్కుల కోసం హిజ్రాల డిమాండ్   -----   'అనంత'లో ఐ ఏ  భీ  సమావేశం రసాభాస
మిడ్ వెస్ట్ మహా మోసం    ------   మా ముందు చిత్తే 
చిదంబరం భేటి   -----    భగ్గుమన్న చికెన్ 
జగన్ ... జాతి పితతో సమానమటా !   ----   ధర్మసంకటం 
కే సి ఆర్  సమర సంకేతం!   ---- ఈ పరిణామలు పార్టికి నష్టమే 
'పంచ' వర్ష ప్రణాళిక !     -----     నాయకత్వం లో లేదు 
 
 

13, ఆగస్టు 2011, శనివారం

గురువిందా లక్షణం

నేడు తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్,తెలుగుదేశం పార్టిలు ,రెండు పత్రికలు కుట్ర పన్నుతున్నాయని వాపోతున్న జగన్ కి నాడు తను చేసిన నిర్వాకం ఏమిటో గుర్తుకు రాకపోవడం విచారకరం. రెండు పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలను కోతపెట్టడం,
అనవసర కేసులు పెట్టడం,రెండు రూపాయలకే దినపత్రిక ని ఇవ్వాలని ప్రకటించడం ,ప్రతిపక్షలని నిర్వీర్యం చేయడానికి ఆపరేషన్ ఆకర్ష చేపట్టడం ఇవ్వన్ని జగన్ తెలియకుండా జరిగాయ? తండ్రి అధికారం తో కన్ను మిన్ను తెలియక ప్రవర్తించినప్పుడు , రెండేళ్ళ రాజకీయ అనుభవానికే ముక్యమంత్రి పదవి వారసత్వ హక్కు అని విర్రవీగినప్పుడు తెలియదా పరిస్థితి చేజరినప్పుడు ఈ దుస్తుతి తప్పదని?
నిజానికి కాంగ్రెస్ జగన్ విషయం లో ఎంతో ఓపికతో వ్యవహరించింది. దాన్ని సద్వినియోగం చేసుకోకా , మొండిగా వ్యవహరించి నేటి దుస్థితి కొనితేచ్చుకున్నాడు.వై యస్ ఆర్ పై జాతీయ స్థాయిలో తెలుగుదేశం ఉద్యమమే చేసిన నాడు వై యస్ ఆర్ ని వేనుకేసుకొని వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికి విచారణకు అదేసించలేదు. న్యాయస్థానం చొరవ చుపించాకుంటే ఇప్పటికి దొంగలు బయటపదేవాళ్ళు కారు.

21, జులై 2011, గురువారం

నాయకులా .... నరహంతకులా

ఇప్పటి నాయకులకు నోటి దురద చాల ఎక్కువ. కెసిఆర్ కి మరి ఎక్కువా. ఈ పార్టి ఆ పార్టి అని లేకుండా అందరు చంపండి లేదా చంపుతం అని ప్రతిరోజు పేపరుకి ఎక్కడమే .ఎమ్మెల్యే గా ప్రమాణం చేసేటప్పుడు ఏమని ప్రమాణం చేసారో ఓ సారి గుర్తుచేయవలసిన అవసరం ఉంది.తెలంగాణే కావాలనుకుంటే సమైకాంధ్రలో ఎందుకు పోటిచేయాలి? ప్రజల ధనమును ఎందుకు వ్రుధాచేయాలి? కోదండ రామ్ ఎందుకు ఇన్ని ఏళ్ళు సమైక్యాంధ్రలో ఉద్యోగం చేయాలి? ఉద్యోగుల జే ఏ సి జూలై నెల జీతం తీసుకున్న తరువాతనే సమ్మె చేస్తామని అంటుంటే రాష్ట్ర కన్నా ఆదాయమే మిన్న అని స్పష్టం గా తెలుస్తుంది.
మరి సీమంధ్ర వాళ్ళ వ్యాపారం చేయకుదదా?
కేంద్ర కాంగ్రెస్స్ పెద్దలు తెలంగాణా ఏర్పాటు కష్టతరం అని అర్థం వచ్చేలా ప్రకటనలు చేస్తారు.అట్లని రాష్ట్రాన్ని సమైక్యం గానే ఉంచుతామని కూడా స్పష్టం చేయరు .ఉభయ ప్రాంత ప్రజలను ,నాయకులను (వీరు పేరుకే నాయకులూ , నిజానికి నీచులు) సందేహలలో ఉంచడమే వారి వ్యూహం. అది నాయకులకు తెలుసు ఐన వారి రాజకీయ లబ్ధికి ఈ అంశాన్ని వాడుకోవడం లో అంతర్జాతీయ స్థాయిలో సాటిరారు వీరికి.తెలంగాణ ఏర్పాటుకు ఆటంకాలు ఏమిటో ఆ ప్రాంత నాయకులకు తెలియంది కాదు, అదే విధంగా ఎందుకు సమైక్యవాదం వినివిస్తున్నదేందుకు తెలియందికాదు.ఐన పరిస్తుతులను తమకనుకూలం గా మర్చుకోవదానికే. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన సమస్య హైదరాబాద్ నగర విషయమే. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమంధ్ర పెట్టుబడిదారులను చంపే ప్రయత్నంలో చావండి అని చెప్పే నాయకుడు మొదట నేనే భలి అవుతానని చెప్పడే? రాష్ట్రాన్ని చీల్చితే కేంద్రం పై ఆత్మాహుతి దాడులు చేస్తాం అని చెప్పే నాయకుడు మొదటి దాడి నేనే చేస్తానని చెప్పడే? అంటే నాయకులూ క్షేమంగానే ఉండాలి ప్రజలు మాత్రం భలి దానాలు చేసుకోవాలి.మన చేత ,మనకోసం ఎన్నుకోబడ్డ నాయకులూ వాళ్ళ కోసం భలి అవుతున్న ప్రజలు ఎటు వెళ్తుంది ఈ రాష్ట్రము? ఈ ఆందోళనలో సామాన్య జనం ఎంతోమంది సమిదలవుతున్న ,ప్రజలకోసం ఏ ఒక్క నాయకుడు భలి ఐయ్యడా? తెలంగాణా నాయకులైన కే సి ఆర్ గాని, కోదండ రామ్ గాని, జయశంకర్ గారు గాని,హరీష్ రావు ,కే టి ఆర్ గాని,నాయని,జాన ,కే కే రామ్ రెడ్డి మొదలైన వ్యక్తులంత ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నవారే .వీరు గాని ,వీరి కుటుంబ సబ్యులు గాని ఉద్యమం కోసం భలి కారే?వీరి ఆస్తులకు ఇసుమంతైన నష్టం జరగదు. కాని ఇతర ప్రజల ఆస్తుల విధ్వంసానికి ఉసిగోల్పుతారు. వీరి ఆస్తులు సంపాదించింది సమైక్యాంధ్రలో , తెలంగాణా కోసం అన్ని వదలుకొనే వాళ్ళు ఆస్తులు తెలంగాణా ప్రజలకు ఇవ్వరే ? అంటే వీళ్ళు మాత్రం ఆస్తులు సంపాదించుకోవాలి సీమంధ్ర వాళ్ళు అడుక్కోవ్వలినా? పైపెచ్చు ఉద్యమం పేరుతో ఆస్తులు పెంచుకున్న నాయకులూ ఎక్కువమందే.
అది తెలియని అమాయక ప్రజలు ఇంకా వారి ప్రకటనలతో ఆత్మాహుతి చేసుకుంటుంటే వారి శవాలను కుడా వదలక తమ వికృత రాజకీయ క్రీడలకు వాడుకోవడం వీరి నీచ స్థితికి నిదర్సనం .మొన్న జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణా కోసం బలి దానాలు చేసుకున్న కుటుంబాలలో ఏ ఒక్కరికైన సీటు కేటాయించారా? అంటే పదవులు నాయకులవి భలి దానాలు ప్రజలవి.
నాయకుల పాల్
మన నాయకులూ ఎంతో భాద్యతతో జన రంజకమైన , అత్యంత భాలమైన (అని నాయకుల ఉద్దేశం ) లోక్ పాల్ బిల్లు పెట్టేరు.నాయకుల కొరకు,నాయకుల చేత ,నాయకులూ ఉన్న పాల్ కాభాట్టే అది నాయక్ పాల్ . ఎంపిల ప్రవర్తన ని ప్రశ్నించే అధికారం లేదు. అవినీతి నాయకుల పై కేసు పెట్టిన నిరుపించాలేకపోతే జైలుయ్ శిక్ష . ప్రజలే అవినీతిని నీరుపిస్తే మరి పోలీసు వ్యవస్థ ఎందుకు? నాయకులందరు నీతిమంతులే అవితే మరి జన లోక్ పాల్ అంటే భయం దేనికి?
మంత్రులు , ప్రధాన మంత్రులు లోక్ పాల్ పరిధికి రానంటే అర్థం ఏమిటి ? నీతివంతులం కామనే గా ? అంటే ప్రజలకు మేము విదేయులము కాము మాకు మేమే విధేయులం అనేగా?

14, మే 2011, శనివారం

మొన్న జరిగిన కడప ఎన్నికలలో కానీ విని ఎరుగని స్థాయిలో నోట్ల పంపిణి జరగడం , ఓ వ్యక్తి ఇటీవల కాలానికి అత్యంత భారి మేజర్టితో గెలవడం చూస్తే మన రాష్ట్ర ప్రజలు ఇంకా అవినీతిని ప్రోత్సహిస్తూ, అవినితిలోనే బ్రతుకున్నారని పిస్తుంది.మన ప్రజలకన్నా తమిళ ప్రజలు ఎంతో పరిణితితో ఆలోచించారు.తయిలలకు ఓసారి అసాపడిన మల్లి అదే తప్పు చేయకుండా, లాప్ టాప్ కి ఆసపడి మనకు అత్యంత మేజర్టి తో గెలిపిస్తారని ఆస పడిన పార్టీని అతః పాతాళానికి తోక్కడమే కాకుండా దేశ రాజకీయాలకు దిక్సూచిగా వ్యవహరించారు.అదే మన ప్రజలు ఒతికి ఎంత ఇస్తావని నాయకులను నిలదీయడం చూస్తే వీళ్ళే అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లున్నది.

7, ఏప్రిల్ 2011, గురువారం

గత వారం రోజులుగా పత్రికలలో పతాక శీర్షిక లో సాయి బాబా అనారోగ్యం గూర్చే ఉంది.వారు దైవ సమానులని, మహితన్వితులని, ప్రత్యక్ష దైవమని ఎన్నో విధాలుగా పొగడటం ,నిజానికి ఆయనే దేవుడైతే సాధారణ మానవుని వలె రోగాపీదితుడు ఎందుకౌతడు?భక్తులకు సకల భాధలను తొలగించే దైవమే ఆ భాధలుకు అతీతుడు కానప్పుడు ప్రత్యక్ష దైవమని ఎలా ప్రచారం చేయగలరు? సర్వాంగ పరిత్యగులమని చెప్పుకొనే వీళ్ళు సకల సౌకర్యాలతో , అస్తైస్వర్యలతో తులతూగే వీళ్ళుదైవ సామాన్యులు?వీళ్ళకు ఉన్న సౌకర్యాలతో సామాన్య ప్రజలు కనీసం రెండు వందల ఏళ్ళు కచ్చితంగా బ్రతకవచ్చు.

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది శుభాకాంక్షలు



తెలుగు జాతి ప్రజలందరికీ శ్రీఖర సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితం లో ఉజ్వల భవిషత్ కి నాంది కావాలని, ఉగాది పచ్చడి లో ఉన్న షడ్రుచుల కలయీక లాగే మీ జీవితం సుకసంతోషాలు నిండాలని ఆ విస్వేస్వరున్ని ప్రార్ధిస్తున్నాను.

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

క్రికెట్ ---- దేశ భక్తులు

మన దేశ యువతకి క్రికెటే ప్రాణం. క్రికెట్ చూస్తూ , జాతీయ జండా ఉపుతూ, గొడవ చేయడమేనా దేశ భక్తి?మద్యపాన మత్తులో ఏమిచేస్తున్నారో తెలియని ఉన్మంత్త స్థితిలోకొందఱు యువకులు అల్లరి చేయోదని అన్న ఓ మహిళపై దాడి చేయడంతో ఆ మహిళా ఆత్మహత్యా చేసుకున్నహర్శనీయమా?ఇదా దేశ భక్తి?నిజానికి హాకి మన జాతీయ క్రీడ కాని ఎంతమంది హాకి చూస్తున్నారు?కొద్ది రోజుల వరకు కార్లు రివర్స్ నడిపెటప్పుడు సారే జహాసేఅచ్చ అని మ్యూజిక్ వస్తుండేది.ఎవ్వరుగాని ఓ దేశ భక్తి గీతాన్ని ఇలా అవమానిస్తున్నారని పిర్యాదు చేయలేదు ఎందుకంటే మన దేశ భక్తికూడా అలానే రివర్స్ లో వెళ్తుంది కాభట్టి.

25, మార్చి 2011, శుక్రవారం

వారసత్వ రాజకీయాలు ___ అవినీతికి మూలాలు.

మన దేశ రాజకీయ ప్రక్షాళన జరగాలంటే, అవినీతిని నిర్ములించాలంటే ముందు అత్యవసరంగా చేయవలసిన పని వారసత్వ నాయకులను తిరస్కరించడం.తండ్రి అధికార నీడలో వారసులందరుకోటను కోట్లకు పడగలెత్తిన వారే. మరి ఎందుకు మల్లి రాజకీయాలకు వస్తున్నారు? ఇంకా దోచుకోనేందుకే గాని ప్రజాసేవ చేసే నాయకులూ మచ్చుకైన కనబడడం లేదు.వారసత్వ రాజకీయాలకు ఆద్యుడు నెహ్రు. తనంతరం అధికారం , ప్రభుత్వ సౌకర్యాలు , తన ఆస్తులు మొత్తం ఇందీర గాంధికి అప్పగించి తొలి వారసత్వ అధికార బదిలి చేసి అవినీతికి శంకుస్థాపనచేసాడు. అక్కడికే ఈ బదిలి నిలిచిపోలేదు. ఇందీర విధించిన ఎమర్జెన్సి సమయంలో జరిగిన అవినీతిలో ప్రధాన పాత్ర సంజయ్ గాంధిదే . ఆ తరువాత రాజీవ్ గాంధి , మల్లి రాజీవ్ గాంధి శ్రీమతి సోనియా గాంధి ప్రభుత్వం లో చేరకున్న,అధికారాన్ని నియంత్రిచడంలో , రాహుల్ గాంధిని భావి ప్రధాని చేయడంలో , అవినీతికి ఉతమివ్వడంలో ప్రధాన పాత్ర.
మన రాష్ట్రములో కూడా ఈ జాడ్యం ఉంది. రాజశేఖర్ రెడ్డి అధికార నీడలో జగన్ అవినీతి ఎన్ని వేల కోట్లో లెక్క చెప్పే స్థితి లేదు.అలాగే తమిళ నాడులో కరుణానిధి అధికార దర్బారులో స్టాలిన్ దే పై చేయి. విలక్షణమైన పార్టిగా చెప్పుకొనే బిజెపిలోకూడా అవినీతిలో అంత ఒక్క తను ముక్కలే అని కర్ణాటకలో తేలిపోయింది.ఇక మన రాష్ట్రంలోనే బొత్స ఫ్యామిలీ మొత్తం రాకీయాలలో వేల్లునుకుపోయింది.కాశ్మీర్ లో ఒమర్ అబ్దుల్లా,కర్ణాటకలో కుమారస్వామి గౌడ,ఒరిస్సా లో నవీన్ పట్నాయక్, మహారాష్ట్రలో అశోక్ చవాన్ మొదలైన వారు వారసత్వ రాజకీయాలతో పదవులనుభావిన్వ్చిన వారే.వారి తండ్రులు కూడా ముక్యమంత్రులుగా ఏలిన వారే.వారసులుకుడా ముక్యమంత్రి పదవి కూడా వారసత్వ అస్తిగానే అనుభవిస్తున్నారు.పూర్వం రాజ్యలనేలే రాజులూ తనంతరం వారసులను సింహాసనం పై కుర్చోపెట్టేవారు. ప్రస్తుతం రాజ్యాలు పోయినా ఇంకా మంత్రులు ఉన్నట్లు ముక్యమంత్రి పదవి తమ అనమ హక్కు గా, వారసత్వ ఆస్తిగా భావించే వారసులను ప్రజలు ఎన్నుకోవడం అంటే అవినీతికి లైసెన్సు ఇవ్వడమే.

22, మార్చి 2011, మంగళవారం

తెలుగు జాతికి అవమానం

వరుస సంగాతనలతోసతమౌతున్న ఆంధ్ర రాష్ట్రము మొన్న జరిగిన సంగటనతో మొత్తం పరువు హుస్సేన్ సాగర్ లో కలిసిపోయింది.విగ్రహాలు ఏమి చేసాయని ఇంతటి గోరానికి పాల్పడ్డారు?వాళ్ళు సీమంధ్రలో పుట్టడమా? లేక తెలంగాణ ప్రాంతంలో విగ్రహాలుగా నిలబద్దతమా?అన్నమయ్య తెలంగాణకు వ్యతిరేకమా? శ్రీకృష్ణ దేవరాయులు తెలంగానని మోసం చేసి పరిపాలించాడా

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

తెలుగు సినిమా ___

మీరు తెలుగు సినిమా తీయలనుకున్తున్నారా? అయితే కధ విషయం లో సందిగ్ధంగా ఉన్నారా? ఏ ఫార్ములాతో సినిమా తీయాలో తెలియడం లేదా?
అందుకు కొన్ని సూత్రాలు:
హీరో తన కుటుంబంలో ఆదర్శం గా ఉండాలి లేదా బెవర్సుగా అన్న ఉండాలి.
హీరో ఎంత వెధవైతే హీరొయిన్ అంత గా ప్రేమించాలి.
ఇద్దరు మొదట ఎంత తీవ్రం గా ద్వేసిన్చుకుంటారో తరువాత అంతగా ప్రేమించుకోవాలి.
హీరో అమ్మాయల్ని కాపాడితే హీరొయిన్ కాకుంటే ఆ అమ్మాయి అన్నయ్య అంటూ కౌగాలించుకోవాలి..
రౌడీలు ఎంత కొట్టిన చలించని హీరో , హీరొయిన్ మందు పుయడానికి చేతితో తాకగానే అమ్మ, అబ్బ, అంటూ అల్లడిపోవాలి.

పెద్ద పైటింగ్ సీన్ లో పది మంది పది తుపాకులతో కాల్చిన హీరో తప్పించుకోగలడు,అదే హీరో మొదటి సారి తుపాకి పట్టుకున్న,గుండుకు ఒక్కరు ,వీలైతే ఇద్దరు కచ్చితంగా పడిపోవాలి.
చేజింగ్ సీన్ లో అయితే విలన్ హీరో చేతికి అందే అంతే దురం లో ఉండాలి,కాని దొరకకుడదు.
క్లైమక్శ్ లో అయితే విలన్ చేతిలో దెబ్బలు తిని పడిపోయిన వెంటనే విలన్ కాల్చకుండా ఓ బారి డైలాగ్ హీరో లేచి నిలబడే వరకు ,లేదా పారిపోఎవరకు చెప్పాలి.

12, ఫిబ్రవరి 2011, శనివారం

కే సి ఆర్ --- ఓ అడ్డ గాడిదా

మన రాష్ట్ర ప్రజలందరికి అత్యంత భారమైన వ్యక్తి ఒక్క కెసిఆర్ .కెసిఆర్ కి కావలసింది ఏంది? ప్రత్యేక రాష్ట్రమా? లేక మిగిలిన ప్రాంత ప్రజలను ద్వేసిన్చాదమా?రాష్ట్రము కావాలంటే రాష్ట్ర ప్రజలందరి మద్దతు కచ్చితం గా అవసరం. సీమంధ్ర ప్రాంత మద్దతు లేకుండా తెలంగాణ ఎట్టి పరిస్తుతులలోరాదు , ఐన సీమంధ్ర ప్రాంతప్రజలను ప్రతిరోజు అనుమానిస్తుంటే ఓపిక అనేది ఓ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది.సీమంధ్ర ప్రజలందరు తిరగబడిన రోజు ఈజిప్టు అధ్యక్షుడి పరిస్థితి కెసిఆర్ కి తప్పక వస్తుంది.తనకి రాష్ట్రము కావాలంటే మా ప్రాంత ప్రజలను కలసి పాదాలను కన్నీళ్ళతో అభిషేకిన్చితే అప్పుడు అలోసిస్తము. ఎన్నికలలో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పోటిచేసిన 40 మందిని గెలిపించుకోలేక పోయిన అసమర్థుడు ఈ కెసిఆర్ .అటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్స్ ఫై అవిశ్వాస తీర్మానం పెడతాడంట , తెలుగుదేశం మద్దతు ఇవ్వలంటా? కడుపుకు అన్నం తింటాడా లేకే కోడలు చేసే పేడ బిరియాని తింటాడా?ముందు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకొని ఎదుటి వ్యక్తులకు గౌరవ మర్యాదలు ఇస్తే వాళ్ళు అదే నీకు ఇస్తారు.

9, ఫిబ్రవరి 2011, బుధవారం

ప్రపంచ ఎనిమిదోవా వింత --- భారత దేశము

మనందరికీ తెలుసు ప్రపంచం లో గుర్తింపు పొందిన వితలు ఏడు అని,కాని మన అందరికి తెలిసి గుర్తింపు పోదని ఎనిమిదొవ వింత గూర్చి కొంత చర్చిద్దాము.ప్రపంచ ధనిక దేశాలకు ఏమాత్రం తక్కువ కాని సహజ సంపద, మేధావులకు కొదవ లేకున్నా స్వాతంత్రం వచ్చిన ఇన్నేలకు కూడా మనము అభివ్రుద్ధిచేన్ధకపోవడం నిజం గా ప్రపంచం లో ఎనిమిదొవ వింతే? కాదంటారా మీ కర్మ.స్వతంత్రమోచ్చిన అరవై ఏళ్లలో వేల సంక్యలో స్కాములు,కోటాను కొట్లలో అవినీతి , లక్షల కొట్లలో విదేశాలకు తరలి వెళ్ళిన నల్ల ధనము . ఇంత జరుగుతున్న ప్రపంచ పటములో మన దేశం కనబడుతున్దంటే నిజముగా అది ప్రపంచ ఎనిమిదొవ వింతే? కాదంటారా మీ కర్మ. భువిస్తీర్నంలో ప్రపంచ ఏడవా స్థానం, ప్రపంచ జనాబాలో రెండవ స్థానం . అతి దగ్గరి కాలంలో మొదటి స్థానం పొందిన ఆశ్చర్యం లేదు. ఐన ఇంకా మన ఆర్థిక వ్యవస్థ కులిపోకుండా ఉందంటేనే నిజం గా ప్రపంచ ఎనిమిదొవ వింతే? కాదంటారా మీ కర్మ.బీపోర్స్ కుంభకోణం , సైన్యానికి శవపేటికల కుంబకోణం , 2G స్పెక్టం కుంబకోణం , తాజాగా యస్ బ్యాండ్ కుంబకోణం ఇవే కాకా గనుల లో , ప్రభుత్వ భూముల కేటాఇమ్పులలో అవినీతి , దేశాన్ని ఉద్ధరించే , ప్రజా సేవే వాళ్ళ పరమ విధిగా , ప్రజాలను ధనవంతులగా చేయనిదే నిద్ర పోనీ రాజకీయ నాయకుల ఉన్న కూడా మన దేశం కొన్ని విషయాలలో ముందు ఉందటే నిజంగా ప్రపంచ ఎనిమిదోవా వింతే?

20, జనవరి 2011, గురువారం

నల్ల ధనము -- ప్రభుత్వ వైపల్యము --- సుప్రీం కోర్ట్ అక్షింతలు

మన దేశ అక్రమ సంపాదన అనేక లక్షల కోట్లు విదేశి బ్యాంకు లలో ములుగుతున్నట్లు,వాటిని బైటకు తీస్తే దేశ ముఖ చిత్రమే మారిపోతుందని చాన్నాళ్ళుగా వినడమే గాని వాటిపై ప్రజలకు ఆమాత్రం ఆసక్తి ఉండేదికాదు.అందుకంటే అక్కడ ఉన్న సొమ్ము సింహభాగం రాజకీయ నాయకులదే అన్నది భహిరంగ రహస్యం.తెలిసి ,తెలిసి నాయకుల నెత్తిపై చేత్తవేసుకోరు.అందుకే నల్ల డబ్బు పై దేశ ప్రజలు అసలు వదుకున్నారు.అయితే ఈ విషయమై మన ప్రధాని అధికారంలోకి రాకమునుపు వంద రోజులలో అక్రమార్కుల వివరాలు భైతపెదతాను అని హామీ ఇచ్చేసరికి అందరం ఎంతో అనంధపద్దము.అయితే తను కూడా ఆ తానులో ముక్కే అని నిరుపిన్చుకున్ట్టున్నారు.మన ప్రధాని స్వయముగా ఓ ఆర్థిక వేత్త అయ్యి ఉందికూడా ఈ సమస్యను తీవ్రంగా తీసుకోకున్దాపోవడం చాలా ఆశ్చర్యము.మన దేశ ఆర్థిక మంత్రి కూడా ద్రవ్యోల్భణం అదుపులోకి తెస్తానని చాలా స్టేట్మెంట్ లు ఇస్తున్నరేగాని నిజానికి ద్రవ్యోల్బణం అదుపుకు స్థిరమైన ,కటిన నిర్ణయాలు తీసుకున్న దాఖలు లేవు.సాక్షాత్తు సుప్రీం కోర్ట్ నల్లధానము విషయమై చేసిన వ్యాకలు కూడా ప్రభుత్వాన్ని కదిలించలేకపోయయ్యన్తేనే ఇక సామాన్యుల గోలకు స్పందిస్తారా?

12, జనవరి 2011, బుధవారం

సంక్రాంతి శుభాకాంక్షలు






అంతర్జాల వీక్షకులకు ,నా శ్రేయోభిలాషులకు , స్నేహితులకు , దేశ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

5, జనవరి 2011, బుధవారం

ప్రియమైన అంతర్జాల వీక్షకులకు , స్నేహితులకు , శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాదితో మొదలు,కాని ప్రతివక్కరికి మన ఉగాదితో నూతన సంవత్సరం మేధాలుకాదు.ఇలా ఒక్కకరికి ఒక్కొక్క సమయం .అయితే ప్రపంచం మొత్తానికి జనవరి ఒకటవ తేదిన నూతన సంవత్సం మొదలు.మనము ఆంగ్లేయుల సంస్కృతికి అలవాటుపడిపోయము. గత సంవత్సరం దేశ చరిత్రలోగాని, రాష్ట్ర చరిత్రలోగాని ఎన్నో విషాదాలు,ఎన్నో గొడవలు,ఎన్నో సంచలనాలు.దేశ చరిత్రలో ప్రప్రధమంగా చెప్పుకోవలసినది 2G స్కాం.సుమారు లక్షదేబ్బై వేల కొట్లుతో ముడిపడిన స్కాం, గత స్కాంల మొత్తనికన్న అధికం.కామన్వెల్త్ క్రీడలలో అవినీతితో ప్రపంచ వ్యాప్తంగా మసకబారము.ఇతర దేశాలలో మన అధికారులకు జరిగిన అవమానాన్ని సంవర్ధవంతముగా కందించ లేకపోయము. ఎన్నాడులేనంతగా కూరగాయలు , నిత్యావసర పదార్థాలు ధరలు అదుపు తప్పాయి.ఇక రాష్ట్ర చరిత్రలో వేర్పేటు వాదం తో రాష్ట్రము నిత్య భందుల తో రాష్ట్ర అర్తికస్తితిని అల్లకల్లోలం చేసింది.ఇక ప్రకృతి తానుమాత్రం తక్కువతిన్నన అని అకాల వరదలతో రైతన్న జీవితాలను బలితీసుకుంది. ప్రతిపక్షాల నిరహారదీక్షలకు ,ముక్యమంత్రుల మార్పులకు , తదితర కారణాలతో పాలనా అగమ్యగోచారమైనది.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...