21, జులై 2011, గురువారం

నాయకులా .... నరహంతకులా

ఇప్పటి నాయకులకు నోటి దురద చాల ఎక్కువ. కెసిఆర్ కి మరి ఎక్కువా. ఈ పార్టి ఆ పార్టి అని లేకుండా అందరు చంపండి లేదా చంపుతం అని ప్రతిరోజు పేపరుకి ఎక్కడమే .ఎమ్మెల్యే గా ప్రమాణం చేసేటప్పుడు ఏమని ప్రమాణం చేసారో ఓ సారి గుర్తుచేయవలసిన అవసరం ఉంది.తెలంగాణే కావాలనుకుంటే సమైకాంధ్రలో ఎందుకు పోటిచేయాలి? ప్రజల ధనమును ఎందుకు వ్రుధాచేయాలి? కోదండ రామ్ ఎందుకు ఇన్ని ఏళ్ళు సమైక్యాంధ్రలో ఉద్యోగం చేయాలి? ఉద్యోగుల జే ఏ సి జూలై నెల జీతం తీసుకున్న తరువాతనే సమ్మె చేస్తామని అంటుంటే రాష్ట్ర కన్నా ఆదాయమే మిన్న అని స్పష్టం గా తెలుస్తుంది.
మరి సీమంధ్ర వాళ్ళ వ్యాపారం చేయకుదదా?
కేంద్ర కాంగ్రెస్స్ పెద్దలు తెలంగాణా ఏర్పాటు కష్టతరం అని అర్థం వచ్చేలా ప్రకటనలు చేస్తారు.అట్లని రాష్ట్రాన్ని సమైక్యం గానే ఉంచుతామని కూడా స్పష్టం చేయరు .ఉభయ ప్రాంత ప్రజలను ,నాయకులను (వీరు పేరుకే నాయకులూ , నిజానికి నీచులు) సందేహలలో ఉంచడమే వారి వ్యూహం. అది నాయకులకు తెలుసు ఐన వారి రాజకీయ లబ్ధికి ఈ అంశాన్ని వాడుకోవడం లో అంతర్జాతీయ స్థాయిలో సాటిరారు వీరికి.తెలంగాణ ఏర్పాటుకు ఆటంకాలు ఏమిటో ఆ ప్రాంత నాయకులకు తెలియంది కాదు, అదే విధంగా ఎందుకు సమైక్యవాదం వినివిస్తున్నదేందుకు తెలియందికాదు.ఐన పరిస్తుతులను తమకనుకూలం గా మర్చుకోవదానికే. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన సమస్య హైదరాబాద్ నగర విషయమే. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమంధ్ర పెట్టుబడిదారులను చంపే ప్రయత్నంలో చావండి అని చెప్పే నాయకుడు మొదట నేనే భలి అవుతానని చెప్పడే? రాష్ట్రాన్ని చీల్చితే కేంద్రం పై ఆత్మాహుతి దాడులు చేస్తాం అని చెప్పే నాయకుడు మొదటి దాడి నేనే చేస్తానని చెప్పడే? అంటే నాయకులూ క్షేమంగానే ఉండాలి ప్రజలు మాత్రం భలి దానాలు చేసుకోవాలి.మన చేత ,మనకోసం ఎన్నుకోబడ్డ నాయకులూ వాళ్ళ కోసం భలి అవుతున్న ప్రజలు ఎటు వెళ్తుంది ఈ రాష్ట్రము? ఈ ఆందోళనలో సామాన్య జనం ఎంతోమంది సమిదలవుతున్న ,ప్రజలకోసం ఏ ఒక్క నాయకుడు భలి ఐయ్యడా? తెలంగాణా నాయకులైన కే సి ఆర్ గాని, కోదండ రామ్ గాని, జయశంకర్ గారు గాని,హరీష్ రావు ,కే టి ఆర్ గాని,నాయని,జాన ,కే కే రామ్ రెడ్డి మొదలైన వ్యక్తులంత ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నవారే .వీరు గాని ,వీరి కుటుంబ సబ్యులు గాని ఉద్యమం కోసం భలి కారే?వీరి ఆస్తులకు ఇసుమంతైన నష్టం జరగదు. కాని ఇతర ప్రజల ఆస్తుల విధ్వంసానికి ఉసిగోల్పుతారు. వీరి ఆస్తులు సంపాదించింది సమైక్యాంధ్రలో , తెలంగాణా కోసం అన్ని వదలుకొనే వాళ్ళు ఆస్తులు తెలంగాణా ప్రజలకు ఇవ్వరే ? అంటే వీళ్ళు మాత్రం ఆస్తులు సంపాదించుకోవాలి సీమంధ్ర వాళ్ళు అడుక్కోవ్వలినా? పైపెచ్చు ఉద్యమం పేరుతో ఆస్తులు పెంచుకున్న నాయకులూ ఎక్కువమందే.
అది తెలియని అమాయక ప్రజలు ఇంకా వారి ప్రకటనలతో ఆత్మాహుతి చేసుకుంటుంటే వారి శవాలను కుడా వదలక తమ వికృత రాజకీయ క్రీడలకు వాడుకోవడం వీరి నీచ స్థితికి నిదర్సనం .మొన్న జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణా కోసం బలి దానాలు చేసుకున్న కుటుంబాలలో ఏ ఒక్కరికైన సీటు కేటాయించారా? అంటే పదవులు నాయకులవి భలి దానాలు ప్రజలవి.
నాయకుల పాల్
మన నాయకులూ ఎంతో భాద్యతతో జన రంజకమైన , అత్యంత భాలమైన (అని నాయకుల ఉద్దేశం ) లోక్ పాల్ బిల్లు పెట్టేరు.నాయకుల కొరకు,నాయకుల చేత ,నాయకులూ ఉన్న పాల్ కాభాట్టే అది నాయక్ పాల్ . ఎంపిల ప్రవర్తన ని ప్రశ్నించే అధికారం లేదు. అవినీతి నాయకుల పై కేసు పెట్టిన నిరుపించాలేకపోతే జైలుయ్ శిక్ష . ప్రజలే అవినీతిని నీరుపిస్తే మరి పోలీసు వ్యవస్థ ఎందుకు? నాయకులందరు నీతిమంతులే అవితే మరి జన లోక్ పాల్ అంటే భయం దేనికి?
మంత్రులు , ప్రధాన మంత్రులు లోక్ పాల్ పరిధికి రానంటే అర్థం ఏమిటి ? నీతివంతులం కామనే గా ? అంటే ప్రజలకు మేము విదేయులము కాము మాకు మేమే విధేయులం అనేగా?

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...