13, నవంబర్ 2010, శనివారం

సంకీర్ణ ప్రభుత్వాలు... దేశ ప్రగతికి పాతరా.

మన దేశ చరిత్రలోనే అత్యంత భారి స్కాం 2G స్పెక్ట్రం విలువా సుమారు లక్ష డెబ్బై వేల కోట్లు( మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ కి రెండు రెట్లు ఎక్కువా) గా కాగ్ నిర్ధారిచింది .అయితే ఇంతటి అవినీతికి భాధ్యులైన సంబంధిత మంత్రి , అధికారులకు ఎంత మాత్రం పశ్చాతాప పడకుండా ఇంకా బుకా ఇస్తుండటం చూస్తుంటే ప్రజల ధనము ని ఎలా దుర్వినియోగం చేయడానికే ఉన్నారనిపిస్తుంది.అధికారపక్షం అసలు అవినీతే జరగలేదని బల్లగుద్ధిచేబుతుంటే , ప్రతిపక్షాలు మాత్రి రాజీనామా కోరుతుంటే ప్రజలకు ఏమిచేయాలో అర్థం అవడం లేదు. ఇంత ప్రజల సొమ్ము దుర్వినియోగామైతే మంత్రి రాజీనామా తో ఆ డబ్బుఖజానకి చేరుతుందా? ప్రజలు చిన్న మొత్తాలు బ్యాంకులకు చేల్లిన్చాకపోతేనే రెవిన్యూ రికవరీ చట్టం తో వాసులు చేస్తారే , ఇంతటి స్కాం కి రాజీనామాతో సరిపెట్టాలని చూస్తున్న ప్రతిపక్షాలకి గాని, చర్య తీసుకోవడానికి బయపడుతున్న "మోస్ట్ ఎలిజబుల్ ప్రైం మినిస్టర్" మన్మోహన్ సింగ్ గాని తేడా ఎంతమాత్రం లేదు.

10, నవంబర్ 2010, బుధవారం

నమస్కారములు

అందరికి నా ధన్యవాదములు. ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా బ్లాగ్ ని నిర్వహిస్తున్నా ఇప్పటికి 200 విజిటర్స్ ఐనందునా నా బ్లాగ్ కి విచ్చేసిన స్నేహితులందరికీ అభినందాలు.

30, అక్టోబర్ 2010, శనివారం

దేవుడు Vs మానవుడు

మన దేశ పురాణాలను ,ఇతిహాసాలు జరిగిన కాలాలను నాలుగు యుగాలుగా , అవి సత్యయుగము,త్రేతాయుగము,ద్వాపరయుగము,కలియుగము గా విభజించారు.అందులో ఎలాంటి సందేహము లేదు, అయితే అవి జరిగిన కాలాలు ఎప్పుడు? సైన్స్ ప్రకారం రాతి యుగము, నవీన రాతియుగాముగా మనము చదువుకున్నాము. దీని ప్రకారం ఏ యుగము ఏ యుగములో జరిగింది? రాతియుగము మనవ పరిణామానికి మొదలు అయితే సత్యయుగము అప్పుడే జరిగిన్దా? అప్పటికి మానవుడు వస్త్రాలు ధరించలేదు, మరి దేవతల స్థితి ఏంటి? లేదు నవీన రాతియుగం లో జరిగిందా? అంటే మానవుడే మొదటివాడు. దేవతలకన్న ముందే జన్మించిన మానవుడు బ్రమ్హా చే ఎలా సృస్టించ బడ్డాడు?
స్నేహితులారా, దయచేసి ఈ సందేహాలను తీర్చండి.

25, అక్టోబర్ 2010, సోమవారం

భారత దేశ చట్టం ---- మన దౌర్బాగ్యం.

మన దేశ న్యాయ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. రాజ్యాంగ రచన కూడా ఎంతో ముందు చూపుతో రాయబడినది. అయితే రాజ్యాంగ పరిరక్షించవలసిన ప్రబుత్వం గాని , రాజకీయ నాయకులూ కానీ న్యాయ వ్యవస్థని, దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు పలుచన చేస్తుంటే దేశ పౌరులుగా మనము విచారపడటం మినహా చేయగలిగినది ఏముంది?దేశ పౌరులు చేసే చిన్న ,చిన్న నేరాలకు కటిన శిక్షలు అమలు చేసే వ్యవస్థలో విదేశి తీవ్రవాదులకు మాత్రం కోటను కోట్లు ఖర్చు చేస్తూ , ప్రధాన మంత్రి భద్రతో సమానంగా భద్రత కల్పిస్తూ మన దేశానికి వి.ఐ.పి తరహాలో చూడటం మన దౌర్బాగ్యం కాకా మరేంటి?
మన దేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ పై నే దాడి చేసి పది మంది బద్రత సిబ్బందిని పోత్తాన్ పెట్టుకున్న నీచులను , ముంబై మరణ హోమం లో సుమారు 150 మందిని కాల్చిన అత్యంత క్రూరుడైన తివ్రవాధిని , కోర్టు ఉరి శిక్ష విధించిన అమలు చేసే సాహసం చేయని నాయకులూ ఓటు రాజకీయాలతో , అవకాసవాదుల కారణం గా మనదేశంలో తివ్రవాదుల ఆగడాలు సృతిమించుతన్నాయి.కసాబ్ ,అప్జాల్ గురు ఇద్దరిని ఒకే గాటిన పోలుస్తూ వరుస క్రమంలో ఉరి తీస్తారట. ఇదికూడా ఓటు రాజకీయమే. ఇద్దరు ముస్లింలు అయినందున ముస్లిం ల ఓట్లు ఎక్కడ పడవో అని , దేశ భద్రతకన్నా వీళ్ళకి పదవులే మిన్న.

21, అక్టోబర్ 2010, గురువారం

రాయలు సమర్పించిన నగలు


శ్రీ కృష్ణ దేవరాయలు 1489 లో జన్మించి 1509 లో చక్రవర్తి గా ప్రకటింపబడి కృష్ణ అష్టమి నాడు పట్టబిశాక్తుడైనాడు.1529 - ౩౦ మధ్యకాలం లో అస్తమించాడు.కేవలం 20 సం..లు మాత్రమే పరిపాలన చేసిన అనంత కీర్తిని, ప్రతిష్టలు సంపాదిన్చుకున్నాడు.1509 ఆగస్ట్ 8 న పట్టబిశాక్తుడైన తరువాత 1513 ఫిబ్రవరి 10 న ఇద్దరు దేవేరులతో కలసి మొదటిసారి స్వామిని దర్శించుకొని నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటం,మూడు సరాలలో ముత్యాలు పొదిగిన కంటాహారం, పతకం లో ఐదు విధాలైన రత్నాలు పొదగబడిన విలువైన 15 బంగారు కంట అబరణలు,కర్పురదీపరధన నిమితం ఒక వెండిహారతి పళ్ళెం ను చిన్నాదీవి స్వామి పాలారగింపు సేవకు ఒక బంగారు గిన్నె , తిరుమల దేవి ఒక బంగారు గిన్నె సుగంధధ్రవ్యలను పెత్తుకోవదానికి ఒక బంగారు గిన్నె కానుకగా సమర్పించారు.1513 మే 12 న ఒక్కడే తిరుమలకు విచ్చేసి ఉత్సవ విగ్రహానికి , భూదేవి ,శ్రీదేవి విగ్రహాలకు వజ్రాలు ,రత్నాలు పొదిగిన చిన్న బంగారు కిరీటాలను బహుమతిగా ఇచ్చారు. జూన్ 13 నాడు తల్లి తండ్రుల జ్ఞాపకార్థం నవరత్నాలు podigina ఆభరణాలు, ఒక పెద్ద బంగారు గిన్నె ను సమర్పించారు.గోడగారనాడు (తిరుపతి ప్రక్కన గల గ్రామాలకు గోడగారనాడు అన్నది ఆనతి పేరు) లోని చత్ర వాడి,తురూరుకరికం బడి అనే గ్రామాలను ధరధతం చేసాడు.1514 జూలై 7 న మరోసారి స్వామి సన్నిధికి వేంచేసారు. స్వామివారికి 30,000 వరహాలతో కనకాబిషేకం ,ముత్యాలు,పద్మ రాగాలు ,మరకతాలు పొదిగిన మూడు సరళ బంగారు ఆభరణాలను,వజ్రాలు పొదిగిన ఒక జత బంగారు కదియలను, కడప జిల్లా లోని తాలపాక గ్రామమని నిత్య నైవేద్యాల నిమిత్తం ధారాదత్తం చేసాడు.చిన్న దేవమ్మ స్వామికి ఒక పతాకాన్ని , ఒక కన్తమలను కానుకగా సమర్పించారు.తిరుమల దేవమ్మ వజ్రాలు , పద్మరాగాలు,పచ్చలు ముత్యాలు పొదిగిన బంగారు పతాకాన్ని కానుకగా ఇచ్చారు.యువ నమ సంవత్సరం కార్తిక భాహుల తదియ నాడు 1515 అక్టోబర్ 25 న రాయలు రాజధానిలో ఉండే స్వామికి నవరత్నప్రబవాలి నే మకరతోరణాన్ని సమర్పించినట్లు తెలుస్తోంది. మారక తోరణం బరువు సుమారు 31,124 వరహాలు.

10, అక్టోబర్ 2010, ఆదివారం

7, అక్టోబర్ 2010, గురువారం

తిరుమల దేవస్థానములు ___ రాజకీయ ఆందోళనలు

గత సంవస్తరముగా ప్రతిరోజు ప్రతి దినపత్రికలలో తిరుమల విశేషాలు ప్రముకంగా చూస్తున్నాము. అంటే తిరుమల ఆలయ ప్రసస్త గూర్చి కాదు నాయకుల ఆగడాలు, అధికారుల అవినీతి, పూజారుల అక్రమాలు , ఆధిపత్యపు పిర్యాదులు, రాయల నగల అదృశ్యం ఇలా చెప్పుకుంటూ పోతే నా బ్లాగ్ కి కేటాయించిన మొత్తం మెమరీ చాలదు.
ముక్యమంత్రుల అనుచరులు పాలకమండలి చైర్మన్ లు గా ఉండటం రివాజు. అయితే తుడా చైర్మన్ ని కూడా పలక మండలిలో సబ్యులుగా , అర్హత లేని వ్యక్తిని ప్రత్యేక అధికారిగా ప్రత్యేక జీవో చేయడం , ప్రతిపక్షనేతలు తిరుమల లో అవినీతి గూర్చి ఆందోళనలు చేయడం , తిరుమలలో తాపసులు పేల్చి రాజకీయ ర్యాలీలు , ఓ వ్యక్తి పుట్టిన రోజు కి ప్రైవేటు యజ్ఞాలు చేయడం, ఆర్జిత టికెట్లు ఇస్తాను సారం జారీచేయడం . వస్త్ర సేవ టికెట్స్ ఇంకా అరవై సంవస్తరాలకు గాని ప్రజలకు అందుబాటులో లేకపోవడం .......................................
ప్రధాన పూజారి కూడా కేవలం తన స్వార్థానికి ప్రాకులాడటం , హుండిలలో తూటా ప్రత్యక్షం కావడం , స్వామివారి నైవేద్యం , అన్న ప్రసాదాలు ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం , ఇలా ఎన్నో వార్తలు ప్రజల మనోబావాలను దెబ్బతీస్తున్నాయి.ఐన అధికారులలో కాని , ఉద్యోగులలో కాని మార్పు అసీంచడం మన తెలివితక్కువతనం .
గతములో ఎన్నడు బ్రమ్హోత్సవలలోఅపశ్రుతులు జరిగినట్టు నేను వినలేదు. కాని ప్రస్తుతం నిత్యం అపసృతులే.
రాయల నగలు ----- వివాదాలు
సమస్త లోకాన్ని, జీవులను నిత్యం కాపాడే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుని దేవాలయాని నమ్ముకొని ఎందరో దొంగలు తిరుమలలో ఉన్నారు. రాయల కలం నుంచే దేవాలయం లో అక్రమాలు చోటుచేసుకున్నాయి.రాయల తరువాత వచ్చిన కానుకలకు లెక్క పత్రం లేని దోపిడి. ముస్లిం పాలకులు కూడా స్వామివారి జోలికి వెళ్ళడానికి సాహసించలేకపోయారు . అయితే మన హిందువులే , అందులోనూ పూజారులే కొన్ని నగలు మాయం చేసారు.
అందున స్వర కీర్తనతో, అఖిలాండ కోటి బ్రంహాండ నాయకుణ్ణి సేవించిన అన్నమయ్య వారసులు కూడా ఉండటం ఆశ్చర్యము.1786 సంవత్సరానికే రాయల నగలు మాయం. బ్రిటిష్ దొరలు కూడా కటిన చట్టాలతో ఆలయ పవిత్రతను కాపాడితే, ఇప్పటి పాలకులు మాత్రం దోపిడి దారులకు కొమ్ముకస్తున్నారు. సర్వ జీవులను కాపాడే దేవదేవుడు తనను తాను రక్షించుకోవలసిన పరిస్థితి. శ్రీ జస్టిస్ జగన్నాధరావు కమిసన్ చెప్పిన చేదు నిజాలు.
లడ్డుల వ్యాపారం
భక్తులకు అత్యంత ప్రాముక్యత కలిగిన ప్రసాదం లడ్డు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నాణ్యత తగ్గుతోందని భాక్తులంటున్నారు .లడ్డుల తయారికి కావలసిన వస్తువులు, పరిమాణానికి ఓ ప్రత్యేకమైన దిట్టం ఉంది.దిట్టం అంటే 51 లాడ్డులకు కావలసిన వస్తువులు రెండు కిలోల సెనగపిండి, నాలుగు కిలోల చెక్కర,1.850 కిలోల నెయ్యి,350 గ్రాముల జీడిపప్పు,175 గ్రాముల ఎండు ద్రాక్ష ,50 గ్రాముల యాలకులు,100 గ్రాముల కలకండ వాడుతారు. అప్పటినుంచి ఇప్పటివరకు దిట్టం లో మార్పు లేదు, రుచి లో మాత్రం చాల తేడా వచ్చింది.


1, అక్టోబర్ 2010, శుక్రవారం

సమాచార హక్కు ---- రాజకీయ జోక్యం

మన దేశం లో సమాచార చట్టానికి స్పూరి రాజస్తాన్ లో మొదలైనది. అక్కడి గ్రామాలలో నిధుల మీదా సోషల్ ఆడిట్ జరగాలని నిలదీయటం ,గ్రమినుల వెనకున్న స్వచంద సంస్థల , వ్యక్తుల పై రాజకీయ నాయకులూ , పార్టిలు , అధికార యంత్రాంగం దాడులు చేయించిన లొంగలేదు.ఇలాంటి ఉద్యమాన్ని నడిపిన నాయకురాలు అరుణ రాయ్ , ఆశికరులు నాయకులతో కలసి దోపిడి చేస్తున్న తిరు నచ్చక , అధికార యంత్రాంగం లో ఉంటూ దోపిడిని అడ్డుకొనే శక్తి లేక
అధికరాన్నే వదలి ప్రజల పక్షలో నిలిచింది.అందుకే ప్రక్యత రామన్ మేగాససే అవార్డుతో ఆమెని సత్కరిచారు.
2005 లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అద్వర్యం లో సమాచార చట్టం రూపొందించా బడినది. అయితే ఇప్పటికి సంపూర్ణం గా అమలుకావడం లేదన్నది ప్రజల అబిప్రాయం . చట్టం రూపొందించిన గనత మాదే అని చెప్పే మన్మోహన్ సింగ్ గారి ఆపీసు నందే సమాచార హక్కు కి స్పందించని వైనం చట్టం అమలుని తెలుపుతుంది. అంతే కాకా మనదేశ వ్యాప్తం గా జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు పది మంది సమాచార చట్టవీరులు హత్యగావించడం , అందులో కొందరి నాయకుల ప్రమేయం ఉండటం కూడా చట్టం అమలుని ప్రస్నిస్తున్నది. నిజానికి చట్టం అమలు చేయవలసిన అధికారులే చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఎక్కడ వీళ్ళ అవినీతి బయటపడుతున్దోనని. చట్టం ప్రకారం అర్జిధారుని వివరాలు రహస్యం గా ఉంచాలి,అయితే అధికారులే నాయకులతో లలుచి పడి అన్నివివరాలు అందించి భౌతిక దాడులకు తమ వంతు సహకారం ఐన్దిస్తున్నారు.

16, సెప్టెంబర్ 2010, గురువారం

రాష్ట్రం.......... ఉద్యమాల వేడి....... అవినీతి

మన రాష్ట్రము లో ఎన్నాడులేనంత తీవ్రం గా , పోటా పోటిగా ప్రత్యేక రాష్ట్రము కోసం , సమైక్య రాష్ట్రము కోసం ఉధృతం గా ఉద్యమాలు జరుగుతున్నాయి.అసలు ఎందుకు రాష్ట్రము విడిపోవాలి? నిజం గా అబివ్రుది జరగలేదనా? లేక పదవుల కోసమా? సమైక్య రాష్ట్రము లో వాళ్ళ ఆస్తులు పెరగలేధనా? అసలు ప్రత్యేక రాష్ట్రము కోసం సరియిన కారణం ఎవ్వరు చూపడం లేదు. నిజం గా విల్లు అబివ్రుద్దే కోరుకొనే వారైతే బందులతో , అల్లర్లతో రాష్ట్ర న్ని అల్లకల్లోలం చేయరు.
ఒక పక్క వరదలతో రాష్ట్ర ఆర్థిక స్థితి చిక్కి సల్యమౌతుంటే నాయకుల అత్యసకు అద్దు లేకుండా దొరికిన కాడికి దోచేస్తుంటే వాటిపై పోరాటం చేయరు ఎందుకంటే తాముకూడా తరువాత అదేపని చేయలికనుకా. రాష్ట్ర ఆర్థిక స్థితి నానాటికి దిగజారి పోతున్నది.ప్రజలు పన్ను కట్టక కాదు, నాయకుల రక్షణకు , వాళ్ళ అవినీతికి , వాళ్ళ పర్యటనలకు బందోబస్తుకు. నాయకుల అవివేకపు ప్రకటనలతో అమకయక , గోర్రేమంధలాంటి బుద్ధిలేని వెధవలు ఆత్మహత్యలతో ఇంకా కల్లోల పరిస్థితిని కల్పిస్తున్నారు. ప్రజలపై నాయకులకు ఎప్పుడు ప్రేమ ఉండదు. వారికి ఎప్పుడు పదవుల పై , అక్రమ ఆర్జన పై మాత్రమే ద్రుస్టి ఉంటుంది.
నిజానికి వాళ్ళు రాజకీయాలకు వచ్చేదే అందుకే. ప్రజలకు సేవ చేయదానికి పదవులే అవసరం ఉండదు.సమాచార చట్టం తో నాయకుల అవినీతి బయట పడుతుండటంతో ప్రజలపై బౌతిక దాడులకు ప్రోత్సహిస్తున్నది కూడా నాయకులే.మల్లి వీళ్ళే ప్రజలకు సేవ చేస్తారు. అః.. అః..ఏది మన దేశ రాజకీయ పరిస్థితి. గనుల కుమ్బకోనలు,
భుపందేరాలు , నాయకుల కుటుంబీకుల వ్యాపారాలలో పెట్టుబడులు ...... ఇందు గలదు అందులేదని కలత వద్దు ఎందెందు వెతికినా అందన్దేకలదు స్కం.

15, సెప్టెంబర్ 2010, బుధవారం

అభివృద్ధికి ఆటంకాలు

మన దేశం అబివృద్ధి చెందుతున్న దేశం.అయితే అబివృద్ధి ఇందులో జరుగుతున్నది? ఏ ఏ రంగాలలో నిజమైన అబివృద్ధి జరుగుతున్నది?ఏవ్వారి వల్ల అబివృద్ధి జరుగుతున్నది?ప్రచారం చేసుకుంటున్నట్లు నిజం గా అబివృద్ధి జరుగుతున్నదా? జరిగిందని మబ్యాపెడుతున్నర? మన దేశం లో ఇప్పటికి వెయిటింగ్ లిస్టు లేని రవాణా సౌకర్యం లేకపోవడం అబివ్రుద్దా? లేక పల్లెలలో కనీస వైద్య సౌకర్యాలు కల్పించని ప్రభుత్వాల అలసత్వం లో అబివ్రుద్దా?
ప్రబుత్వ పధకాలు సామాన్య ప్రజలకు అంధక పోవడం లో, పార్టి కార్యకర్తలకు చేరడం లో అబివ్రుద్దా?

26, ఆగస్టు 2010, గురువారం

పత్రికలు...... మానవత్వం.

ప్రతిరోజు ఉదయం దిన పత్రిక చదవనిదే రోజువారీ దినచర్య మొదలుకాదు.అయితే పత్రికలు నిజం గా మనకు అవసరమైన విషయాలు అందిస్తుందా? అనవసరమైన విషయాలతో ప్రతి ఉదయం మన మనసుని వికలం చేయడం తప్పితే మూడు రూపాయలు పెట్టికోన్నారే అని పట్టించుకోరు.
యువతీ మానబంగం చేసిన కమందుడిని కావాలంటే ఇంటర్వ్యు తీసుకొని మెయిన్ పేజి లో వేస్తారు.ఈ మధ్య ఆంధ్ర జ్యోతిలో ఓ న్యూస్ చదివాను..ఓ రౌడి షీటర్ అనారోగ్యం తో హాస్పిటల్ కి వస్తే జాయిన్ చేసుకోవడాని డాక్టర్స్ నిరాకరిచి
పంపెసరటా, కదలలేని స్థితిలో ఉన్న అతనిని పంది పిక్కుతిన్తుంటే విలేకరి ఫోటో తిసి న్యూస్ వేసాడు. ఆహా ఏమి ఎంత చక్కగా తన భాద్యతను నిర్వహించాడు. జాయిన్ చేసుకొని డాక్టర్స్ ని నిందించలేదు. పంది దాడి చేస్తున్నప్పుడు దాని తరిమి మనిసి ని రక్షిస్తామన్న చిన్న స్ప్రుహకుడా లేని వీళ్ళు మన కోసం ప్రభుత్వాలతో కోట్లడుతయా?

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...