7, అక్టోబర్ 2010, గురువారం

తిరుమల దేవస్థానములు ___ రాజకీయ ఆందోళనలు

గత సంవస్తరముగా ప్రతిరోజు ప్రతి దినపత్రికలలో తిరుమల విశేషాలు ప్రముకంగా చూస్తున్నాము. అంటే తిరుమల ఆలయ ప్రసస్త గూర్చి కాదు నాయకుల ఆగడాలు, అధికారుల అవినీతి, పూజారుల అక్రమాలు , ఆధిపత్యపు పిర్యాదులు, రాయల నగల అదృశ్యం ఇలా చెప్పుకుంటూ పోతే నా బ్లాగ్ కి కేటాయించిన మొత్తం మెమరీ చాలదు.
ముక్యమంత్రుల అనుచరులు పాలకమండలి చైర్మన్ లు గా ఉండటం రివాజు. అయితే తుడా చైర్మన్ ని కూడా పలక మండలిలో సబ్యులుగా , అర్హత లేని వ్యక్తిని ప్రత్యేక అధికారిగా ప్రత్యేక జీవో చేయడం , ప్రతిపక్షనేతలు తిరుమల లో అవినీతి గూర్చి ఆందోళనలు చేయడం , తిరుమలలో తాపసులు పేల్చి రాజకీయ ర్యాలీలు , ఓ వ్యక్తి పుట్టిన రోజు కి ప్రైవేటు యజ్ఞాలు చేయడం, ఆర్జిత టికెట్లు ఇస్తాను సారం జారీచేయడం . వస్త్ర సేవ టికెట్స్ ఇంకా అరవై సంవస్తరాలకు గాని ప్రజలకు అందుబాటులో లేకపోవడం .......................................
ప్రధాన పూజారి కూడా కేవలం తన స్వార్థానికి ప్రాకులాడటం , హుండిలలో తూటా ప్రత్యక్షం కావడం , స్వామివారి నైవేద్యం , అన్న ప్రసాదాలు ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం , ఇలా ఎన్నో వార్తలు ప్రజల మనోబావాలను దెబ్బతీస్తున్నాయి.ఐన అధికారులలో కాని , ఉద్యోగులలో కాని మార్పు అసీంచడం మన తెలివితక్కువతనం .
గతములో ఎన్నడు బ్రమ్హోత్సవలలోఅపశ్రుతులు జరిగినట్టు నేను వినలేదు. కాని ప్రస్తుతం నిత్యం అపసృతులే.
రాయల నగలు ----- వివాదాలు
సమస్త లోకాన్ని, జీవులను నిత్యం కాపాడే కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుని దేవాలయాని నమ్ముకొని ఎందరో దొంగలు తిరుమలలో ఉన్నారు. రాయల కలం నుంచే దేవాలయం లో అక్రమాలు చోటుచేసుకున్నాయి.రాయల తరువాత వచ్చిన కానుకలకు లెక్క పత్రం లేని దోపిడి. ముస్లిం పాలకులు కూడా స్వామివారి జోలికి వెళ్ళడానికి సాహసించలేకపోయారు . అయితే మన హిందువులే , అందులోనూ పూజారులే కొన్ని నగలు మాయం చేసారు.
అందున స్వర కీర్తనతో, అఖిలాండ కోటి బ్రంహాండ నాయకుణ్ణి సేవించిన అన్నమయ్య వారసులు కూడా ఉండటం ఆశ్చర్యము.1786 సంవత్సరానికే రాయల నగలు మాయం. బ్రిటిష్ దొరలు కూడా కటిన చట్టాలతో ఆలయ పవిత్రతను కాపాడితే, ఇప్పటి పాలకులు మాత్రం దోపిడి దారులకు కొమ్ముకస్తున్నారు. సర్వ జీవులను కాపాడే దేవదేవుడు తనను తాను రక్షించుకోవలసిన పరిస్థితి. శ్రీ జస్టిస్ జగన్నాధరావు కమిసన్ చెప్పిన చేదు నిజాలు.
లడ్డుల వ్యాపారం
భక్తులకు అత్యంత ప్రాముక్యత కలిగిన ప్రసాదం లడ్డు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నాణ్యత తగ్గుతోందని భాక్తులంటున్నారు .లడ్డుల తయారికి కావలసిన వస్తువులు, పరిమాణానికి ఓ ప్రత్యేకమైన దిట్టం ఉంది.దిట్టం అంటే 51 లాడ్డులకు కావలసిన వస్తువులు రెండు కిలోల సెనగపిండి, నాలుగు కిలోల చెక్కర,1.850 కిలోల నెయ్యి,350 గ్రాముల జీడిపప్పు,175 గ్రాముల ఎండు ద్రాక్ష ,50 గ్రాముల యాలకులు,100 గ్రాముల కలకండ వాడుతారు. అప్పటినుంచి ఇప్పటివరకు దిట్టం లో మార్పు లేదు, రుచి లో మాత్రం చాల తేడా వచ్చింది.


1 కామెంట్‌:

jyothirmayee చెప్పారు...

Recently i saw one news that some private company is issuing 'Laddus' to the people in the name of GOD.

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...