20, డిసెంబర్ 2013, శుక్రవారం

మన దేశం లో ప్రబుత్వం పనితీరు

ఒక చీమ ప్రతి  రోజు పొద్దున్నే వచ్చి తన పని తాను చేసుకుపోతున్డేది . ఆత్ర పడకుండా సాయంత్రం వరకు సంతోషంగా పని చేసుకోవడం చూసి ఓ సింహం ఆశ్చర్యపడి ఏ పర్యవేక్షణ లేకుండానే ఈ విధం గా చేస్తుంటే ఓ పర్యవేక్షణ అధికారి ఉంటె మరింత నాణ్యంగా, మరింత ఏక్కువ పని రాబట్టవచ్చని బావించి ఓ బోద్ధికను పర్యవేక్షణ అధికారిగా నియమించిన్ధి. బొద్దింక డ్యూటీ లో చేరిన వెంటనే ఓ గడియారం కొని చిమ ముందు పెట్టి చేసిన పని ని లెక్క కట్టి రిపోర్ట్ రాయడానికి  ఓ అసిస్టెంట్ ని నియమించుకొని చీమ ఎవ్వరితో ఎంత సేపు మాట్లాడుతుందో , ఇతర చీమలు ఎంతెంత పని చేస్తున్నాయో కానీ పెట్టడానికి ఓ సాలె పురుగును నియమించుకున్ధి..  ఈ పనిని చూసి సింహం చాల ముచ్చట పదిపొయిన్ధి. అడవి జంతువుల సమావేశం లో చూపెట్టడానికి ఉత్పతి రెట్లు ,మార్కెట్ ట్రెండ్ కు సంబంధించి గ్రాఫ్ లు తాయారు చేయమని అధెసించిన్ధి. బొద్దింక వెంటనే ఓ కంప్యూటర్ ని, లేసేర్ ప్రింటర్ ని కొని ఐ టి శాఖ  నిర్వహణ  కోసం ఓ ఈగ ను నియమించిన్ధి.
చీమ కు ఈవని చూసేసరికి విసుగొచ్చి ఇంత మంది తన పై కన్ను పెట్టేసరికి దాని పని లో ఉన్న ఆనందాన్నికోల్పోయింది.ధాని ఉత్పతి థగ్గిన్ధి. సింహం చాల సేపు అలోచించి పరిష్కారం కోసం గుడ్ల గుబకు కాన్సల్టెన్సి ఇచ్చి రిపోర్ట్ తాయారు చెయమన్ధి. ఓ వంద  రోజులు అధ్యయనం చేసి పది గ్రంధాల రిపోర్ట్ ఇచ్చింది . సిబ్బంది ఎక్కువై పని జరగడం లేదని దాని సారంశం. వెంటనే సింహం అందరికన్నా ముందే చీమ ని పని నుంచి థొలగించెసిన్ధి.

మన దేశం లో ప్రబుత్వం పనితీరు కూడా అచ్చం ఈలనె ఉంటుంది.( ఆధారం ఆంధ్ర జ్యోతి )

15, ఆగస్టు 2013, గురువారం

జై సమైకాంద్ర

నేడు ప్రతిరోజు ,ప్రతి పేపర్ లో జన జీవనం ఎలా  స్తంబించిపోయిందో  చూచి చూసి మనసెంతో వికలమైపొథున్నధి.   భాధ్యులు ఎవ్వరు? సోనియా గాంధీ నా , కే సి అర్ లేక కాంగ్రెస్ రాజకీయ నాయకులా ?  మొదట కాంగ్రెస్ నాయకులూ చంద్ర బాబు లేఖ ఇచ్చినందున తెలంగాణ ఇచ్చామని పత్రికలలో చిప్పిన వాళ్ళే వై యస్ అర్ 99 లో లేఖ ఇచ్చారు అందుకే ఇచ్చమంతున్నారు . మరి 99 నుంచి 2013 వరకు ఏమి చేస్తున్నట్టు? లేని వ్యక్తి పై నింద వేయడం ఎంత వరకు సబబు  మన నాయకులకే థెలియలి.  సీమంధ్ర లో ఉద్యమాలు జరగలేదని తెలంగాణ నాయకులూ చెబుతున్నది చూస్తుంటే వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లెధు. మా కోరిక సమైక్యం ఆది ఉన్నప్పుడు ఉద్యమం చేయవలసిన అవసరం లెధు. మీకు ప్రత్యేక రాష్ట్రము కావాలని ఉద్యమం చేయడానికి  ఎంత హక్కు ఉందో మాకు సమైకాంధ్ర ఉద్యమం చేయడానికి అంతే హక్కు ఉంది . ఇన్ని రోజులు తెలంగాన కి అన్యాయం జరుగుతుంటే మరి కేంద్ర ప్రబుత్వం గాని ,రాష్ట్ర ప్రబుత్వం గాని ఎందుకు చర్యలు  తిసుకొలెధు? ఈ రోజే తెలంగాణకి అన్యాయం జరగలేదుకదా? ఇన్ని రోజులు  మూసుకొని ఉండి ఈ రోజు అత్యంత బాధాకర స్థితిలో విబజన చేయడం ఎంతవరకు సబబు ?ఈ రోజు తెలంగాణ నాయకులూ  గొంతు చించుకొని అన్యాయం జరిగిందంతున్నారే ఆ ప్రాంత నాయకులూ ఒకప్పుడు నిజామ్ పాలనలో అత్యంత దుర్బర స్థితిలో ఉన్నారే అప్పుడు నిజం ని ఎందుకు గద్దె దిపలేకపోఎరే ? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ నాడు పోలీస్ ఏక్షన్  పెట్టక పొయిఉన్తె ఈ రోజు తెలంగాణ నేటి   పాకస్తాన్ లో విలీనం ఐయిఉన్దెధని తెలియదా? ఆ నాడు నిజాం  నుంచి విముక్తి చేసుకొనిఆంధ్ర ప్రదేశ్ పాలనలో అభివృద్ధి చెంది నేడు ప్రత్యేకం కావాలంటే కేంద్ర ప్రబుత్వం మరి కళ్ళు మూసుకొని సమ న్యాయం చేయకనే విభజించడం ఎంత  న్యాయం? ఒకరికి న్యాయం చేయడానికి ఇంకోక్కరికి అన్యాయం చేయడం ఎంత న్యాయం ?  

5, జనవరి 2013, శనివారం

నేటి చిత్రం

    గత కొన్ని రోజులుగా  ఎ పేపర్ చూసిన  ఢిల్లీ లో జరిగిన రేప్  అమ్మాయి గూర్చి పేజిలకు పేజీలు వ్రాస్తున్నారు . అయితే అంతకు మునుపు ఓ హాస్పిటల్  ఓ డ్యూటీ లో ఉన్న నర్స్ పై వార్డ్ బాయ్ అత్యాచారం జరపబోయి ప్రతిగటిస్తే  కుక్కలు ను భంధించే గొలుసుతో కట్టేయడం తో తన మెదడుకు ఆక్సిజన్ అంధక గత నలభై సంవస్తరాలుగా కోమాలో ఉన్న ఆవిడా గూర్చి ఎవ్వరన్న ప్రస్తావించారా ?

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...