20, డిసెంబర్ 2013, శుక్రవారం

మన దేశం లో ప్రబుత్వం పనితీరు

ఒక చీమ ప్రతి  రోజు పొద్దున్నే వచ్చి తన పని తాను చేసుకుపోతున్డేది . ఆత్ర పడకుండా సాయంత్రం వరకు సంతోషంగా పని చేసుకోవడం చూసి ఓ సింహం ఆశ్చర్యపడి ఏ పర్యవేక్షణ లేకుండానే ఈ విధం గా చేస్తుంటే ఓ పర్యవేక్షణ అధికారి ఉంటె మరింత నాణ్యంగా, మరింత ఏక్కువ పని రాబట్టవచ్చని బావించి ఓ బోద్ధికను పర్యవేక్షణ అధికారిగా నియమించిన్ధి. బొద్దింక డ్యూటీ లో చేరిన వెంటనే ఓ గడియారం కొని చిమ ముందు పెట్టి చేసిన పని ని లెక్క కట్టి రిపోర్ట్ రాయడానికి  ఓ అసిస్టెంట్ ని నియమించుకొని చీమ ఎవ్వరితో ఎంత సేపు మాట్లాడుతుందో , ఇతర చీమలు ఎంతెంత పని చేస్తున్నాయో కానీ పెట్టడానికి ఓ సాలె పురుగును నియమించుకున్ధి..  ఈ పనిని చూసి సింహం చాల ముచ్చట పదిపొయిన్ధి. అడవి జంతువుల సమావేశం లో చూపెట్టడానికి ఉత్పతి రెట్లు ,మార్కెట్ ట్రెండ్ కు సంబంధించి గ్రాఫ్ లు తాయారు చేయమని అధెసించిన్ధి. బొద్దింక వెంటనే ఓ కంప్యూటర్ ని, లేసేర్ ప్రింటర్ ని కొని ఐ టి శాఖ  నిర్వహణ  కోసం ఓ ఈగ ను నియమించిన్ధి.
చీమ కు ఈవని చూసేసరికి విసుగొచ్చి ఇంత మంది తన పై కన్ను పెట్టేసరికి దాని పని లో ఉన్న ఆనందాన్నికోల్పోయింది.ధాని ఉత్పతి థగ్గిన్ధి. సింహం చాల సేపు అలోచించి పరిష్కారం కోసం గుడ్ల గుబకు కాన్సల్టెన్సి ఇచ్చి రిపోర్ట్ తాయారు చెయమన్ధి. ఓ వంద  రోజులు అధ్యయనం చేసి పది గ్రంధాల రిపోర్ట్ ఇచ్చింది . సిబ్బంది ఎక్కువై పని జరగడం లేదని దాని సారంశం. వెంటనే సింహం అందరికన్నా ముందే చీమ ని పని నుంచి థొలగించెసిన్ధి.

మన దేశం లో ప్రబుత్వం పనితీరు కూడా అచ్చం ఈలనె ఉంటుంది.( ఆధారం ఆంధ్ర జ్యోతి )

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...