28, మే 2012, సోమవారం

Jagan








జగన్ ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖునిచేయడం అంటా? అంటే ఈయనే ప్రజాస్వామ్య పరిరక్షకులా? కాంగ్రెస్ MLA  ల తో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలు రావడానికి కారణమైన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యక్తా? ఆయన్ని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసినట్లా?ఇంకో రెండు సంవత్సరాలలో ఎన్నికలు రాబోతున్న సంధర్బంలో ఒక్క గొప్పలు చెప్పుకోవడానికి 
తప్ప ఎందుకు పనికిరాని  ఈ టైం లో  తన గొప్పతనం చెప్పుకోవడానికి కొన్ని కోట్ల ప్రజధనము  ధుర్వినియోగించడం ఎంత వరకు సమంజసం? అప్పుడు కడప ఎన్నికలు ,ఇప్పుడు ఈ ఎన్నికలు. వీటన్నిటికి కారణం జగన్. ప్రజాధనం దుర్వినియోగపరచడం  జగన్ , తెలంగాణ రాష్ట్ర సమితి లకు  మాత్రమే  విద్య. మరి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తరతా?ప్రజల కోసం , ప్రజలచేత , ప్రజలతో ఏర్పడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. మరి ఇక్కడ జగన్ కోసం , జగన్ చేత , జగన్తో ఏర్పడే దీన్ని ఏమన్దాము? కచ్చితంగ జగన్ స్వామ్యం.ఈ రాష్ట్ర రక్షణకు దేవుడు పంపిన పరిరక్షకుడే ఈ జగన్ అని జనం విస్వసించాలి కాబోలు .ఈయన పేపరులో వచ్చిందే వార్త , ఈయన గారు చెప్పిందే న్యాయం కాబోలు, అందుకే సాక్షి ఫై చర్య తీసుకుంటే అది పత్రిక స్వేక్షని అడ్డుకోవడం , ఈయని అక్రమాలను విచారిస్తే వేధించడమే. నిజానికి ఇక్కడ కొన్ని అర్థం కాని విషయాలెన్నో ఉన్నాయి.కొండ సురేఖ గారు, హరిరామజోగయ్య గారు, మైసుర రెడ్డి గారు , భుమ నాగిరెడ్డి గారు, సబ్బం హరి గారు ఇత్యదులందరు  ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నవారే. వీళ్ళ రాజకీయ వయస్సు అంత లేని జగన్ వెంట ఎందుకు వేలుతున్నారో అర్థం కావడం లేదు.అదే జగన్ కి అతి ఆత్మవిశ్వాసానికి  కారణం అయి ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...