16, సెప్టెంబర్ 2024, సోమవారం

ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన విరాళాలు మొత్తం ఒక లక్ష పదహేను వేల రూపాయలు.. ఇది ఒక చరిత్ర, గతంలో ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కి విరాళాలు ఇవ్వాలని నిర్ణయించడం అతితక్కువ సమయంలోనే లక్ష పై చీలుకు మొత్తం సేకరించి చెక్ రూపంలో ముఖ్యమంత్రి గారికి 11/09/24 వ తేదీ వారి క్యాంపు ఆఫీస్ నందు అందచేయడం జరిగినది. ... ఈ కార్యక్రమంలో స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగేస్వర్ రెడ్డిగారు , ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు , కోశాధికారి శ్రీ మోహన్ రావు గారు , ఉపాధ్యక్షులు శ్రీ అంబికా పతిగారు , లాక్కోజు సింహాచలం గారు , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేంద్రబాబు గారు , ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు , పెద్దలు అబ్దుల్ సలంగారు గుంటూరు కన్వీనర్ శ్రీ సూర్యనారాయణ గారు , అన్నమయ్య జిల్లా కన్వీనర్ శ్రీ రెడ్డి బాబు గారు , వేణు ఆచారి గారు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు

ఇట్లు

       స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు






25, జనవరి 2024, గురువారం

స్వార్థపరులు

    ముందుతరం వాళ్ళకి తెలీదు భవిష్యత్హులో మనకు మించి నీతులు  చెప్పేవారు పుట్టుకొస్తారని తెలిసిఉంటే పాపం భతృహరి  శుభాషితాలు , సుమతి శతకాలు , వేమన గారి పద్యాలు లాంటివి వ్రాసేవారు కారేమో. పేపర్ లో ఇంతకుమించిన నీతులు  నాయకులూ ప్రతిరోజు చెబుతున్నారు ఒకరేమో ముందు పాలకుడు  అవినీతిపరుడు ప్రజాధనం నష్టం చేసాడు అంటూ సొంత పత్రికకు వేల కోట్ల ప్రజాధనం యాడ్స్ పేరుతో తినేస్తాడు. ఇంకొకాయన ఏమో ఇంకోరకంగా తినడం మంత్రులు ,శాసనసభ్యులు వాటాలు వేసుకొని మరి తింటున్నారు అయినా కూడా గొర్రె జనాలు వారికే మద్దతు ఇస్తూ బ్రహ్మరధం పడుతుంటారు. మాకు అమ్మవడి , ఆసరా , సంక్రాంతి కానుకలు , ఆదరణ పనిముట్లు ,పెన్షన్ ఇస్తున్నారు అందుకే మా ఓటు వారికే అంటారు మల్లి ఎలక్షన్ లో ఓటుకు ఎంత అంటారు? 
        ప్రతిఒక్కరు గమనించాల్సిన విషయం పార్టీలు , నాయకులూ ఎవ్వరు సొంత డబ్బు జేబులోనుంచి తీసివ్వరు కేవలం పార్టీలకు వచ్చిన విరాళాలకు ఇంకోరకంగా వారికీ లాభం చేకూరేలా చేస్తుంటారు అప్పుడు ప్రజల ఆస్తులు వేల  ఎకరాలు సంతర్పమ్ చేస్తుంటారు. ఈ మధ్య ఆటలు ప్రోగ్రాం పేరుతో కోట్లు నష్టం దానివల్ల ప్రయోజనం ఏమిటో ఎవ్వరికి తెలియదు బాట్ ఓపెన్ మార్కెట్ లో ఒక రేట్ mrp  ఒక రేట్ ఉంటుంది ప్రభుత్వం MRP రేట్ కికొద్దిగా తక్కువతో కొని అధికారులు , మంత్రులు అందరూ కమిషన్స్ తింటారు అంతిమంగా ప్రజాదానం గోవిందా. ఆదరణ పనిముట్లు 30వేల  యూనిట్ ఓపెన్ మార్కెట్ లో 21000 కె దొరుకుతాయి మిగిలిన 9000 వాటాలకు వెళ్తుంది. యాడ్స్ , అమ్మవడి  , ఆసరా పేరుతో పడుతున్న డబ్బు కేవలం మనందరినీ కుదవ పెట్టి తెస్తున్న అప్పు అని ఎవ్వరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి డబ్బు ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాదు మనందరం కడుతున్న పన్నుల రూపంలో వెళ్తుంది అ ప్పులు ఎక్కువైతే ఎక్కువ పన్నులు కట్టకతప్పదు. అభివృద్ధి ఉంటె , వాణిజ్యం పెరిగితే ప్రజలకు పన్నులభారం తగ్గుతుంది. తెలివితక్కువ గొర్రెలు వాటికే ఓటు వేస్తున్నారు అభివృద్ధి చేసి ఉపాధి  ఇవ్వండి  మేము కష్టం తో సంపాదించుకుంటాము అని చెప్పడం వదలి కేవలం డబ్బులు వేసేయండి ఇంట్లో కూర్చొని తింటాము అనే స్థాయికి వచ్చేసారు 



21, జనవరి 2024, ఆదివారం

వీడియోలు

హలో ఫ్రెండ్స్ మీ ఆనందంకోసం సరదాగా నవ్వుకోవడానికి కొన్ని సరదా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను 




పునఃప్రారంభం

చాలా  సంవత్సరాల తరువాత నా బ్లాగ్ తిరిగి వ్రాయడం  మొదలుపెడుతున్నాను .గత 10 సంవత్సరాల కావొస్తున్నది  బ్లాగ్  పోస్ట్  చేయడం నిలిచిపోయి,  తిరిగి  సరికొత్త విషయాలు , వీడియోలు , సాంకేతిక విషయాలు , కార్పెంటర్ సంబంధించిన పోస్టులతో ఈరోజునుంచి ప్రారంభింస్తున్నాను. గత వీక్షకులు ఎంతమంది ఉన్నారో తెలియదు గాని  కొత్త ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుతూ మీ     సురేంద్ర బాబు 



ముఖ్యమంత్రి సహాయనిధికి యూనియన్ విరాళం

                           స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సభ్యులకు శుభోదయం....  విజయవాడ వరద బాధితులను ఆదుకొనుటకు  మనం సేకరించిన...