28, జనవరి 2024, ఆదివారం

టెక్నాలజీ తో నేను

               ఇప్పుడు వస్తున్న కంప్యూటర్స్ లాప్టాప్ లు డెస్క్ టాప్ లు చూస్తుంటే బలే ఆశ్చర్యం ఎందుకో తెలుసా 1997 లో శీనురెడ్డి గారి బిల్డింగ్ లో SCIT పేరుతో  ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టారు పగలంతా కార్పెంటర్ వర్క్ చేసి సాయంత్రం కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళేవాడిని. PGDCA లో జాయిన్ అయ్యాను  ఆలా కంప్యూటర్ టచ్ వచ్చింది ఇప్పుడే ఫోన్లకే RAM అంటే తక్కువ 4gb  అప్పుడు కంప్యూటర్ కి RAM  256MB మాత్రమే హార్డ్ డిస్క్ కేవలం 512MB  అదికూడా dos (డిస్క్ ఆపరేటింగ్ సిస్టం ) విండోస్ కూడా కొత్తగా అప్పుడే వచ్చింది. 

             అప్పట్లో cd డ్రైవ్ ,పెన్ డ్రైవ్ లాంటివి అస్సలు ఊహించలేదు అప్పుడంతా  1.44 MB  ప్లాపీ డ్రైవ్ అదికూడా బెంగుళూరు కి వెళ్ళినప్పుడు అవెన్యూ రోడ్ లో 30రూ  లెక్కన ఓ 4 కొనేవాడిని అదో సరదా. ఇప్పుడు  ఎందుకో అలనాటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి  5in  ప్లాపీ డ్రైవ్ అని పేపర్ ల ఉండేది. ఇప్పుడు వర్డ్ అప్పుడు వర్డ్ స్టార్ అని , excell  కి లోటస్ ఇలా ఉండేవి ఇలా అప్పట్లో సరదాకి నేర్చుకున్న. తర్వాత ఇంటర్నెట్ కేఫ్ లు వచ్చాక ఫేస్బుక్ , ఆర్కుట్ లాంటి సోషల్ మీడియా లో అకౌంట్స్ చేసుకున్న. 2009 లో ఈ బ్లాగ్ కూడా మొదలు పెట్టాను.  

            మొదటి సెల్ ఫోన్ 2004 మే 14 న సెకండ్ హ్యాండ్ లో మోటోరోలా సి200

            మొదటి స్మార్ట్ ఫోన్ మే 14 2014  lava iris 356   

            మొదటి 4జి ఫోన్ యూనిక్యూ 





25, జనవరి 2024, గురువారం

స్వార్థపరులు

    ముందుతరం వాళ్ళకి తెలీదు భవిష్యత్హులో మనకు మించి నీతులు  చెప్పేవారు పుట్టుకొస్తారని తెలిసిఉంటే పాపం భతృహరి  శుభాషితాలు , సుమతి శతకాలు , వేమన గారి పద్యాలు లాంటివి వ్రాసేవారు కారేమో. పేపర్ లో ఇంతకుమించిన నీతులు  నాయకులూ ప్రతిరోజు చెబుతున్నారు ఒకరేమో ముందు పాలకుడు  అవినీతిపరుడు ప్రజాధనం నష్టం చేసాడు అంటూ సొంత పత్రికకు వేల కోట్ల ప్రజాధనం యాడ్స్ పేరుతో తినేస్తాడు. ఇంకొకాయన ఏమో ఇంకోరకంగా తినడం మంత్రులు ,శాసనసభ్యులు వాటాలు వేసుకొని మరి తింటున్నారు అయినా కూడా గొర్రె జనాలు వారికే మద్దతు ఇస్తూ బ్రహ్మరధం పడుతుంటారు. మాకు అమ్మవడి , ఆసరా , సంక్రాంతి కానుకలు , ఆదరణ పనిముట్లు ,పెన్షన్ ఇస్తున్నారు అందుకే మా ఓటు వారికే అంటారు మల్లి ఎలక్షన్ లో ఓటుకు ఎంత అంటారు? 
        ప్రతిఒక్కరు గమనించాల్సిన విషయం పార్టీలు , నాయకులూ ఎవ్వరు సొంత డబ్బు జేబులోనుంచి తీసివ్వరు కేవలం పార్టీలకు వచ్చిన విరాళాలకు ఇంకోరకంగా వారికీ లాభం చేకూరేలా చేస్తుంటారు అప్పుడు ప్రజల ఆస్తులు వేల  ఎకరాలు సంతర్పమ్ చేస్తుంటారు. ఈ మధ్య ఆటలు ప్రోగ్రాం పేరుతో కోట్లు నష్టం దానివల్ల ప్రయోజనం ఏమిటో ఎవ్వరికి తెలియదు బాట్ ఓపెన్ మార్కెట్ లో ఒక రేట్ mrp  ఒక రేట్ ఉంటుంది ప్రభుత్వం MRP రేట్ కికొద్దిగా తక్కువతో కొని అధికారులు , మంత్రులు అందరూ కమిషన్స్ తింటారు అంతిమంగా ప్రజాదానం గోవిందా. ఆదరణ పనిముట్లు 30వేల  యూనిట్ ఓపెన్ మార్కెట్ లో 21000 కె దొరుకుతాయి మిగిలిన 9000 వాటాలకు వెళ్తుంది. యాడ్స్ , అమ్మవడి  , ఆసరా పేరుతో పడుతున్న డబ్బు కేవలం మనందరినీ కుదవ పెట్టి తెస్తున్న అప్పు అని ఎవ్వరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి డబ్బు ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాదు మనందరం కడుతున్న పన్నుల రూపంలో వెళ్తుంది అ ప్పులు ఎక్కువైతే ఎక్కువ పన్నులు కట్టకతప్పదు. అభివృద్ధి ఉంటె , వాణిజ్యం పెరిగితే ప్రజలకు పన్నులభారం తగ్గుతుంది. తెలివితక్కువ గొర్రెలు వాటికే ఓటు వేస్తున్నారు అభివృద్ధి చేసి ఉపాధి  ఇవ్వండి  మేము కష్టం తో సంపాదించుకుంటాము అని చెప్పడం వదలి కేవలం డబ్బులు వేసేయండి ఇంట్లో కూర్చొని తింటాము అనే స్థాయికి వచ్చేసారు 



21, జనవరి 2024, ఆదివారం

వీడియోలు

హలో ఫ్రెండ్స్ మీ ఆనందంకోసం సరదాగా నవ్వుకోవడానికి కొన్ని సరదా వీడియోలు పోస్ట్ చేస్తున్నాను 




పునఃప్రారంభం

చాలా  సంవత్సరాల తరువాత నా బ్లాగ్ తిరిగి వ్రాయడం  మొదలుపెడుతున్నాను .గత 10 సంవత్సరాల కావొస్తున్నది  బ్లాగ్  పోస్ట్  చేయడం నిలిచిపోయి,  తిరిగి  సరికొత్త విషయాలు , వీడియోలు , సాంకేతిక విషయాలు , కార్పెంటర్ సంబంధించిన పోస్టులతో ఈరోజునుంచి ప్రారంభింస్తున్నాను. గత వీక్షకులు ఎంతమంది ఉన్నారో తెలియదు గాని  కొత్త ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుతూ మీ     సురేంద్ర బాబు 



20, డిసెంబర్ 2013, శుక్రవారం

మన దేశం లో ప్రబుత్వం పనితీరు

ఒక చీమ ప్రతి  రోజు పొద్దున్నే వచ్చి తన పని తాను చేసుకుపోతున్డేది . ఆత్ర పడకుండా సాయంత్రం వరకు సంతోషంగా పని చేసుకోవడం చూసి ఓ సింహం ఆశ్చర్యపడి ఏ పర్యవేక్షణ లేకుండానే ఈ విధం గా చేస్తుంటే ఓ పర్యవేక్షణ అధికారి ఉంటె మరింత నాణ్యంగా, మరింత ఏక్కువ పని రాబట్టవచ్చని బావించి ఓ బోద్ధికను పర్యవేక్షణ అధికారిగా నియమించిన్ధి. బొద్దింక డ్యూటీ లో చేరిన వెంటనే ఓ గడియారం కొని చిమ ముందు పెట్టి చేసిన పని ని లెక్క కట్టి రిపోర్ట్ రాయడానికి  ఓ అసిస్టెంట్ ని నియమించుకొని చీమ ఎవ్వరితో ఎంత సేపు మాట్లాడుతుందో , ఇతర చీమలు ఎంతెంత పని చేస్తున్నాయో కానీ పెట్టడానికి ఓ సాలె పురుగును నియమించుకున్ధి..  ఈ పనిని చూసి సింహం చాల ముచ్చట పదిపొయిన్ధి. అడవి జంతువుల సమావేశం లో చూపెట్టడానికి ఉత్పతి రెట్లు ,మార్కెట్ ట్రెండ్ కు సంబంధించి గ్రాఫ్ లు తాయారు చేయమని అధెసించిన్ధి. బొద్దింక వెంటనే ఓ కంప్యూటర్ ని, లేసేర్ ప్రింటర్ ని కొని ఐ టి శాఖ  నిర్వహణ  కోసం ఓ ఈగ ను నియమించిన్ధి.
చీమ కు ఈవని చూసేసరికి విసుగొచ్చి ఇంత మంది తన పై కన్ను పెట్టేసరికి దాని పని లో ఉన్న ఆనందాన్నికోల్పోయింది.ధాని ఉత్పతి థగ్గిన్ధి. సింహం చాల సేపు అలోచించి పరిష్కారం కోసం గుడ్ల గుబకు కాన్సల్టెన్సి ఇచ్చి రిపోర్ట్ తాయారు చెయమన్ధి. ఓ వంద  రోజులు అధ్యయనం చేసి పది గ్రంధాల రిపోర్ట్ ఇచ్చింది . సిబ్బంది ఎక్కువై పని జరగడం లేదని దాని సారంశం. వెంటనే సింహం అందరికన్నా ముందే చీమ ని పని నుంచి థొలగించెసిన్ధి.

మన దేశం లో ప్రబుత్వం పనితీరు కూడా అచ్చం ఈలనె ఉంటుంది.( ఆధారం ఆంధ్ర జ్యోతి )

15, ఆగస్టు 2013, గురువారం

జై సమైకాంద్ర

నేడు ప్రతిరోజు ,ప్రతి పేపర్ లో జన జీవనం ఎలా  స్తంబించిపోయిందో  చూచి చూసి మనసెంతో వికలమైపొథున్నధి.   భాధ్యులు ఎవ్వరు? సోనియా గాంధీ నా , కే సి అర్ లేక కాంగ్రెస్ రాజకీయ నాయకులా ?  మొదట కాంగ్రెస్ నాయకులూ చంద్ర బాబు లేఖ ఇచ్చినందున తెలంగాణ ఇచ్చామని పత్రికలలో చిప్పిన వాళ్ళే వై యస్ అర్ 99 లో లేఖ ఇచ్చారు అందుకే ఇచ్చమంతున్నారు . మరి 99 నుంచి 2013 వరకు ఏమి చేస్తున్నట్టు? లేని వ్యక్తి పై నింద వేయడం ఎంత వరకు సబబు  మన నాయకులకే థెలియలి.  సీమంధ్ర లో ఉద్యమాలు జరగలేదని తెలంగాణ నాయకులూ చెబుతున్నది చూస్తుంటే వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లెధు. మా కోరిక సమైక్యం ఆది ఉన్నప్పుడు ఉద్యమం చేయవలసిన అవసరం లెధు. మీకు ప్రత్యేక రాష్ట్రము కావాలని ఉద్యమం చేయడానికి  ఎంత హక్కు ఉందో మాకు సమైకాంధ్ర ఉద్యమం చేయడానికి అంతే హక్కు ఉంది . ఇన్ని రోజులు తెలంగాన కి అన్యాయం జరుగుతుంటే మరి కేంద్ర ప్రబుత్వం గాని ,రాష్ట్ర ప్రబుత్వం గాని ఎందుకు చర్యలు  తిసుకొలెధు? ఈ రోజే తెలంగాణకి అన్యాయం జరగలేదుకదా? ఇన్ని రోజులు  మూసుకొని ఉండి ఈ రోజు అత్యంత బాధాకర స్థితిలో విబజన చేయడం ఎంతవరకు సబబు ?ఈ రోజు తెలంగాణ నాయకులూ  గొంతు చించుకొని అన్యాయం జరిగిందంతున్నారే ఆ ప్రాంత నాయకులూ ఒకప్పుడు నిజామ్ పాలనలో అత్యంత దుర్బర స్థితిలో ఉన్నారే అప్పుడు నిజం ని ఎందుకు గద్దె దిపలేకపోఎరే ? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ నాడు పోలీస్ ఏక్షన్  పెట్టక పొయిఉన్తె ఈ రోజు తెలంగాణ నేటి   పాకస్తాన్ లో విలీనం ఐయిఉన్దెధని తెలియదా? ఆ నాడు నిజాం  నుంచి విముక్తి చేసుకొనిఆంధ్ర ప్రదేశ్ పాలనలో అభివృద్ధి చెంది నేడు ప్రత్యేకం కావాలంటే కేంద్ర ప్రబుత్వం మరి కళ్ళు మూసుకొని సమ న్యాయం చేయకనే విభజించడం ఎంత  న్యాయం? ఒకరికి న్యాయం చేయడానికి ఇంకోక్కరికి అన్యాయం చేయడం ఎంత న్యాయం ?  

టెక్నాలజీ తో నేను

               ఇప్పుడు వస్తున్న కంప్యూటర్స్ లాప్టాప్ లు డెస్క్ టాప్ లు చూస్తుంటే బలే ఆశ్చర్యం ఎందుకో తెలుసా 1997 లో శీనురెడ్డి గారి బిల్డిం...